- అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలో టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ
- గాయపడిన వారిని తాడిపత్రి ఆసుపత్రికి తరలించిన పోలీసులు, స్థానికులు
- ఎన్టీఆర్ జిల్లా పెద్దాపురంలో నకిలీ బ్యాలెట్ పేపర్ల కలకలం
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం జిల్లా యల్లనూరు మండల కేంద్రంలోని స్థానిక జడ్పీ హైస్కూల్ పోలింగ్ బూత్ వద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఇది కాస్తా పరస్పర దాడులకు దారితీసింది.
ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
మరోవైపు, ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో నకిలీ బ్యాలెట్ పేపర్ల వ్యవహారం కలకలం రేపింది. గ్రామంలోని 8వ వార్డు పోలింగ్ కేంద్రం పరిధిలో ఓ వర్గానికి చెందిన వ్యక్తి వద్ద నకిలీ బ్యాలెట్ పత్రాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన ప్రత్యర్థి వర్గం పోలింగ్ బూత్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగడంతో కాసేపు పోలింగ్ నిలిచిపోయింది.
సమాచారం అందుకున్న ఆర్డీవో, తహశీల్దార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై పూర్తి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం అధికారులు పోలింగ్ ప్రక్రియను పునఃప్రారంభించారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు పెంచారు.