ఈ మధ్య కాలంలో యాక్షన్ థ్రిల్లర్ .. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు వెండితెరపై తమ జోరు చూపుతున్నాయి. ఇదే సమయంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు కూడా తమ ప్రత్యేకతను చాటుతున్నాయి. ఇక అడపాదడపా బయోపిక్ లు కూడా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. అలా వచ్చిన ఒక బయోపిక్ యే 'గరివిడి లక్ష్మి'. బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా, అక్టోబర్ 17వ తేదీన విడుదలైంది. ఈ నెల 26వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
అది విజయనగరం జిల్లా పరిధిలోని 'గరివిడి' అనే గ్రామం. అక్కడే దేవుడమ్మ (రాశి) ఫ్యామిలీ నివసిస్తూ ఉంటుంది. భర్త నాయుడు .. కూతురు లక్ష్మితో ఆమె జీవితం హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులలోనే ఆమె సన్యాసినిగా మారిపోతుంది. భర్తకు వేరే యువతితో వివాహం చేసి పంపించేస్తుంది. కూతురును మాత్రం తన పోషణలోనే ఉంచుతుంది. చిన్నప్పటి నుంచి లక్ష్మికి పాటలంటే చాలా ఇష్టం. వయసుతో పాటు ఆ ఇష్టం కూడా పెరుగుతూ పోతుంది. అలాంటి పరిస్థితులలోనే సుబ్బారావు అనే వ్యక్తి ప్రోత్సాహంతో ఆమె దృష్టి బుర్రకథల వైపు మళ్లుతుంది.
లక్ష్మి గాత్రానికి .. ఆమె బుర్రకథలు చెప్పే తీరుకు ఎంతోమంది అభిమానులుగా మారిపోతారు. దాంతో 'సత్తిబాబు'(రాగ్ మయూర్)తో కలిసి లక్ష్మి తనకంటూ ఒక ప్రత్యేకమైన టీమ్ ను తయారు చేస్తుంది. అయితే ఒకే శైలికి అలవాటుపడిపోతూ వచ్చిన బుర్రకథల వలన జనాలు విసిగిపోయారనే విషయం ఆమెకి అర్థమవుతుంది. దాంతో జానపద బాణీలలో బుర్రకథను జనాల మధ్యలోకి తీసుకెళుతుంది. కొత్తగా ఆమె చేసిన ఆ ప్రయత్నానికి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెడుతుంది.
డబ్బు .. పేరు వస్తుండటంతో లక్ష్మికి ఎంతో సంతోషంగా రోజులు గడుస్తూ ఉంటాయి. తనతో పాటు కలిసి పనిచేస్తున్న సత్తిబాబుతో ఆమె అందమైన జీవితాన్ని ఊహించుకుంటుంది. అలాంటి పరిస్థితులలోనే ఆ ఊరి ప్రెసిడెంట్ ఆమెపై కన్నేస్తాడు. ఆమె కాదందనే కోపంతో కక్షగడతాడు. ఆ కోపంతో అతను ఏం చేస్తాడు? సత్తిబాబు పట్ల పెట్టుకున్న నమ్మకం ఆమె జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? సినిమా వాళ్లను లక్ష్మి నమ్మకపోవడానికి కారణం ఏమిటి? అనేది మిగతా కథ.
జీవితాన్ని గెలుపు - ఓటమి అనేవి ఎప్పుడూ ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అయితే ఎప్పుడూ గెలవడం కోసం తపించేవాళ్లు .. శ్రమించేవాళ్లు కొందరే ఉంటారు. అలాంటివాళ్లు తమ ప్రయత్న లోపం కారణంగా ఓడిపోవడం జరగదు. ఇతరులను నమ్మడం వలన ఓడిపోతుంటారు. ఓదార్పు లేకపోవడం వలన వెనకబడిపోతుంటారు. అలా ఓడిపోయిన ఒక యువతి కథనే ఇది. అయినా మరుగున పడిపోకుండా కాలం వెలికి తీసిన ఖరీదైన మాణిక్యం లాంటి గరివిడి లక్ష్మి కథ ఇది.
గరివిడి లక్ష్మి బాల్యం .. యవ్వనం .. ఆమె వివాహం .. బుర్రకథ దిశగా అడుగులు వేయడం .. చదువులేని కారణంగా ఎదురైన అవమానాలు .. కెరియర్ ఆరంభంలో ఎదురైన విమర్శలు .. వాటిని అధిగమించడానికి ప్రయత్నాలు చేయడం వంటి అంశాలతో ఫస్టాఫ్ చకచకా సాగిపోతుంది. ఇక సినిమావాళ్లు మోసం చేయడం .. మనసిచ్చిన వ్యక్తి మాట తప్పడం .. నమ్మినవారు మోసం చేయడం వంటి అంశాలతో సెకండాఫ్ నడుస్తుంది.
గరివిడి లక్ష్మి జీవితాన్ని బుర్రకథకు ముందు .. ఆ తరువాత అన్నట్టుగా దర్శకుడు రెండు భాగాలుగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు. ఫస్టాఫ్ అంతా జానపద బాణీలతో కూడిన పాటలతో హుషారుగా సాగుతుంది. నమ్మినవారి చేతిలో ఆమె మోసపోవడం వంటి బరువైన సన్నివేశాలతో సెకండాఫ్ ను ఆవిష్కరించారు. ఆమె జీవితంలోని చీకటి వెలుగులను ఒక కథగా బ్యాలెన్స్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పాలి.
గరివిడి లక్ష్మి బాల్యం .. యవ్వనం .. ప్రేమలో పడటం .. బుర్రకథతో ప్రయాణం .. ఆమె అనుభవించిన మానసిక సంఘర్షణ .. ఇలా ఆమె జీవితంలోని అన్ని అంశాలను సహజత్వానికి దగ్గరగా దర్శకుడు ఆవిష్కరించాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ దిశగా కథను పరిగెత్తించిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే ఆయన ఎంచుకున్న విలేజ్ నేపథ్యం ఈ కథకు మరింత బలాన్ని చేకూర్చింది. సన్నివేశాలకు .. పాటలకు తగిన ఆహ్లాదాన్ని పంచడంలోను, బరువైన సన్నివేశాలకు బలాన్ని ఇవ్వడంలోను విలేజ్ లొకేషన్స్ ప్రధానమైన పాత్రను పోషించాయని చెప్పాలి.
గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది జీవించిందనే చెప్పాలి. ఆమె నటనయే ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ అనాలి. స్టేజ్ పై హుషారుగా స్టెప్పులు వేయడంలోను .. ఆవేదన భరితమైన సన్నివేశాలలోను ఆనంది నటన మెప్పిస్తుంది. నరేశ్ .. రాశి .. రాగ్ మయూర్ .. ఇలా అందరూ తమ పాత్ర పరిధిలో ఆకట్టుకుంటారు. ఆదిత్య ఫొటోగ్రఫీ .. చరణ్ అర్జున్ నేపథ్య సంగీతం .. రవితేజ ఎడిటింగ్ మంచి మార్కులు కొట్టేస్తాయి.
అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదించినట్టు అనిపించినా, ఆ వెంటనే పుంజుకుంటూ ఉండటం వలన ఆడియన్స్ ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ ఉంటారు. కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా సహజత్వానికి దగ్గరగా వెళ్లడం కూడా దర్శకుడి అభిరుచికి అద్దం పడుతుంది. అయితే క్లైమాక్స్ లో, గరివిడి లక్ష్మికి గల గౌరవాన్ని కాపాడతానంటూనే, ఆమెను 'నువ్వు .. నీకు ..' అంటూ అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడే మాటలు ఇబ్బంది పెడతాయి. ఇక్కడ కాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఒక బయోపిక్ గా ఈ కంటెంట్ కనెక్ట్ అవుతుందనే చెప్పాలి.

Movie Details
Movie Name: Garividi Lakshmi
Genre: Drama, Musical
Release Date: 26 Nov 2026
Cast: Anandhi, Rag Mayur, Naresh, Raasi, L B Sriram, Srinivas Avasarala
Director: Gowri Naidu Jammu
Music: Charan Arjun
Banner: People Media Factory
Review By: Peddinti