- ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో 'ఏఎస్‌బీఎల్ లెగసీ' ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసిన రియల్టీ సంస్థ
- ప్రాజెక్ట్ ప్రారంభించిన తొలిరోజే రూ. 800 కోట్ల విలువైన విక్రయాలు
- దాదాపు 7.97 ఎకరాల్లో 50 అంతస్తులతో మూడు భారీ స్కైస్క్రాపర్ టవర్లు
- ఫ్లాట్ల ధర రూ. 1.99 కోట్ల నుంచి ప్రారంభం.. హ్యాండోవర్ వరకు నో ఈఎంఐ ఆఫర్
- సెంట్రల్ హైదరాబాద్‌లో గేటెడ్ కమ్యూనిటీలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుందన్న సీఈవో అజితేష్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ ఏఎస్‌బీఎల్ (ASBL) రియల్టీ మార్కెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. సెంట్రల్ హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ‘ఏఎస్‌బీఎల్ లెగసీ’ ప్రారంభించిన తొలిరోజే ఏకంగా రూ. 800 కోట్ల విలువైన విక్రయాలు నమోదు చేసింది.
కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 7.97 ఎకరాల విస్తీర్ణంలో ఈ మెగా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో గ్రౌండ్ లెవల్ నుంచి 50 అంతస్తుల ఎత్తుతో మూడు భారీ రెసిడెన్షియల్ టవర్లను అభివృద్ధి చేయనున్నారు. నగర నడిబొడ్డున విస్తారమైన గేటెడ్ కమ్యూనిటీలో ఇళ్లను కోరుకునే కొనుగోలుదారుల కోసం 3, 4 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫ్లాట్ల పరిమాణం 1,970 నుంచి 3,015 చదరపు అడుగుల వరకు ఉండగా, ధరలు రూ. 1.99 కోట్ల నుంచి ప్రారంభమవుతున్నాయి.
ఈ ప్రాజెక్ట్‌లో 73.25 శాతం స్థలాన్ని ఓపెన్ స్పేస్‌గా కేటాయించారు. అలాగే 74,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ క్లబ్‌హౌస్, 50కి పైగా ఆధునిక జీవనశైలి వసతులను ఏర్పాటు చేస్తున్నారు. ఫిట్‌నెస్, వినోదం కోసం మొత్తం 1.70 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు. కొనుగోలుదారులపై నిర్మాణ సమయంలో ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ‘ఫ్లాట్ అప్పగించే వరకు జీరో ఈఎంఐ’ ఫైనాన్సింగ్ ఆఫర్‌ను కూడా సంస్థ ప్రవేశపెట్టింది.
ప్రాజెక్ట్ ప్రారంభం సందర్భంగా ఏఎస్‌బీఎల్ వ్యవస్థాపకుడు, సీఈవో అజితేష్ కోరుపోలు మాట్లాడుతూ, సెంట్రల్ హైదరాబాద్‌లో నివాసాలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుందని అన్నారు. సరైన గేటెడ్ కమ్యూనిటీని నిర్మించడానికి తగినంత పెద్ద భూమి దొరకకపోవడమే ఇప్పటివరకు ఇక్కడ ప్రధాన సమస్యగా ఉండేదని, ఆ లోటును తమ ప్రాజెక్ట్ భర్తీ చేస్తుందని వివరించారు. నగర శివారు ప్రాంతాలకు వెళ్లకుండా, ప్రధాన నగరంలోనే ఆధునిక వసతులు కోరుకునే వారికి ‘ఏఎస్‌బీఎల్ లెగసీ’ చక్కటి ఎంపికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.