- అయోధ్య భూముల్లో 400 నుంచి 900 శాతం దాకా భారీ రాబడి
- 2021 నుంచి ఇప్పటివరకు బంగారంపై 166 శాతం రిటర్న్స్
- రామాలయ నిర్మాణం, విమానాశ్రయం అభివృద్ధితో పెరిగిన డిమాండ్
- అయోధ్యలో రికార్డు స్థాయిలో 29.9 కోట్లకు చేరిన పర్యాటకుల సంఖ్య
- భారీ లాభాలు ఉన్నప్పటికీ భూముల కొనుగోలులో రిస్క్ ఎక్కువ
సాధారణంగా భారతీయ మదుపరులు అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని భావిస్తుంటారు. అయితే గడచిన కొన్నేళ్లలో బంగారం కంటే అయోధ్యలోని రియల్ ఎస్టేట్ రంగం ఊహించని రీతిలో భారీ లాభాలను అందించినట్లు తాజా విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్డీటీవీ కథనం ప్రకారం.. పసిడి పెట్టుబడులతో పోలిస్తే అయోధ్యలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేసిన వారికి కళ్లు చెదిరే స్థాయిలో రాబడి దక్కింది.
పెట్టుబడుల రాబడి వివరాలను పరిశీలిస్తే.. 2021 నుంచి 2026 నవంబర్ మధ్య కాలంలో బంగారంపై దాదాపు 166 శాతం వరకు లాభం వచ్చింది. అదే సమయంలో అయోధ్యలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లోని స్థలాల విలువ 2019 నుంచి 2026 మధ్య ఏకంగా 400 శాతం నుంచి 900 శాతం వరకు పెరిగింది. దీనిని సులభంగా అర్థం చేసుకోవాలంటే.. ఎవరైనా రూ.5 లక్షల రూపాయలు బంగారంలో పెట్టుబడి పెట్టి ఉంటే, నేడు దాని విలువ సుమారు రూ.13.3 లక్షలకు చేరింది. అదే రూ.5 లక్షలను అయోధ్యలోని ప్రధాన ప్రాంతాల స్థలాల్లో పెట్టి ఉంటే, ఐదు రెట్లు పెరిగిన చోట రూ.25 లక్షలుగా, పది రెట్లు పెరిగిన ప్రాంతాల్లో ఏకంగా రూ.50 లక్షల రూపాయల వరకు విలువ పెరిగింది. పన్నులు, ఇతర రిజిస్ట్రేషన్ ఖర్చులు మినహాయించి చూసినా ఇది అసాధారణమైన వృద్ధిగా చెప్పవచ్చు.
అయోధ్యలో భూముల ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది భవ్య రామమందిర నిర్మాణం, ప్రతిష్ఠాపన కాగా.. రెండోది ఆధునిక విమానాశ్రయం, రైల్వే స్టేషన్ వంటి మౌలిక సదుపాయాల వేగవంతమైన విస్తరణ. ఇక మూడోది పర్యాటక రంగంలో వచ్చిన భారీ విప్లవం. అయోధ్యను సందర్శించిన భక్తులు, పర్యాటకుల సంఖ్య 2023లో 5.8 కోట్లుగా ఉండగా, 2025 నాటికి అది ఏకంగా 29.9 కోట్లకు చేరుకుంది. ఈ విపరీతమైన రద్దీ కారణంగా వాణిజ్య, నివాస స్థలాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
అయితే రాబడి పరంగా అయోధ్య భూములు ముందంజలో ఉన్నప్పటికీ, బంగారం కంటే ఇవే పూర్తిగా మేలని చెప్పలేం. ఎందుకంటే ఈ రెండు పెట్టుబడుల స్వభావం భిన్నంగా ఉంటుంది. బంగారం అనేది తక్కువ రిస్క్, అధిక లిక్విడిటీ కలిగిన ఆస్తి. అవసరమైనప్పుడు దీనిని నిమిషాల్లో అమ్ముకుని నగదుగా మార్చుకోవచ్చు. దీనికి ఎలాంటి నిర్వహణ ఖర్చులు లేదా చట్టపరమైన సమస్యలు ఉండవు. కానీ రియల్ ఎస్టేట్ విషయంలో రిస్క్ చాలా ఎక్కువ. స్థలాలను వెంటనే నగదుగా మార్చుకోవడం సులభం కాదు, కొన్నిసార్లు అమ్మకానికి నెలలు లేదా సంవత్సరాల సమయం పట్టవచ్చు. అలాగే లీగల్ సమస్యలు, భూముల నిర్వహణకు సంబంధించిన ఇబ్బందులు కూడా ఉంటాయి.
అయోధ్య పరిణామాల ద్వారా పెట్టుబడిదారులు గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే.. రియల్ ఎస్టేట్లో లొకేషన్ ఎంపిక లాభాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అయితే అయోధ్యలోని ప్రతి స్థలం కూడా 5 నుంచి 10 రెట్లు పెరిగిందని భావించలేమని, కేవలం ఎంపిక చేసిన కీలక ప్రాంతాల్లోనే ఇలాంటి అసాధారణ లాభాలు వచ్చాయని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా గతం నాటి అద్భుత పనితీరు భవిష్యత్తు రాబడికి ఎలాంటి హామీ కాదని పెట్టుబడిదారులు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.