- ఓర్వకల్లు జై రాజ్ ఇస్పాత్ రెండో దశ విస్తరణ
- రూ.3,378 కోట్ల పెట్టుబడితో 934 కొత్త ఉద్యోగాలు
- వివరాలను సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి నారా లోకేశ్
- యాంకర్ ఇన్వెస్టర్‌గా నిలిచినందునే ఇతర కంపెనీలు వచ్చాయని వెల్లడి
- సీమను పారిశ్రామిక హబ్‌గా మార్చడమే లక్ష్యమని స్పష్టీకరణ
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్‌లోని జై రాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ రెండో దశ విస్తరణకు సిద్ధమైందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ విస్తరణ నిమిత్తం సుమారు రూ.3,378 కోట్ల అదనపు పెట్టుబడులు రానున్నాయని, తద్వారా మరో 934 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన శనివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రెండో దశ విస్తరణ పనుల కోసం 600 ఎకరాల భూమిని కేటాయించనున్నట్లు ఆయన వివరించారు.
గతంలో 2016లోనే తమ ప్రభుత్వం ఈ పరిశ్రమకు భూమిని కేటాయించగా, మే 2018లో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనికి శంకుస్థాపన చేశారని లోకేశ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. "ఒకప్పుడు బీడు భూములుగా ఉన్న ఈ ప్రాంతం, నేడు రాయలసీమలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌కు వేదికగా నిలిచింది" అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్లాంట్ సుమారు 430 ఎకరాల్లో రూ.2,100 కోట్లకు పైగా పెట్టుబడితో తన కార్యకలాపాలను దిగ్విజయంగా కొనసాగిస్తోందని తెలిపారు.
ఓర్వకల్లు పారిశ్రామిక శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పిన ‘యాంకర్’ ఇన్వెస్టర్‌గా జై రాజ్ ఇస్పాత్‌ను లోకేశ్ అభివర్ణించారు. ఈ సంస్థ రాకతోనే రిలయన్స్, జాక్సన్, అగస్త్య గ్రీన్ ఎనర్జీ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని ఆయన వివరించారు. ఈ ప్లాంట్‌లో 65 శాతం మంది స్థానికులే ఉపాధి పొందుతుండటం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. రాయలసీమను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక హృదయభూమిగా తీర్చిదిద్దేందుకు అందరం చేయి చేయి కలుపుదామని లోకేశ్ పిలుపునిచ్చారు.