- స్థానిక ఎన్నికల ఫలితాల సరళిపై టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రెస్ మీట్
- పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా కూటమికే ప్రజల స్పష్టమైన మద్దతు అని వెల్లడి
- అభివృద్ధి మరియు సంక్షేమం చూసే ప్రజలు పెద్దపీట వేశారని స్పష్టీకరణ
- ప్రజలు దౌర్జన్యాలు లేని ప్రశాంతమైన పాలనను కోరుకుంటున్నారన్న ఎమ్మెల్యే
- స్థానిక సంస్థల విజయంతో కూటమి ప్రభుత్వంపై బాధ్యత మరింత పెరిగిందని ఉద్ఘాటన
రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రజల మనోభావాలను మరోసారి స్పష్టంగా చాటిచెప్పాయని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పేర్కొన్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన 30 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నో రకాల ఎన్నికలు, విభిన్న ప్రజాభిప్రాయాలను చూశానని, అయితే ప్రస్తుత ఫలితాలు మాత్రం అత్యంత చారిత్రాత్మకమైనవని వ్యాఖ్యానించారు.
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక విధమైన ఆలోచన, పట్టణ ప్రాంతాల్లో మరో విధమైన రాజకీయ ధోరణి ఉండేదని గద్దె రామ్మోహన్ రావు గుర్తుచేశారు. ఉద్యోగులు, రైతులు, విద్యావంతులు, నిరుద్యోగులు ఒక్కో వర్గం ఒక్కో విధంగా తీర్పు ఇచ్చేవారని వివరించారు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి కూటమికి అఖండ విజయాన్ని కట్టబెట్టారని, ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే ప్రజాభిప్రాయం ప్రతిబింబిస్తోందని ఆయన తెలిపారు. ఈవీఎంలు, బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్లు.. విధానం ఏదైనా ప్రజల తీర్పు మాత్రం కూటమి వైపే స్పష్టంగా ఉందని చెప్పారు.
రాష్ట్రంలో రోడ్ల పునర్నిర్మాణం నుంచి సంక్షేమ పథకాల అమలు వరకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన రహదారుల రూపురేఖలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్ వేగంగా మార్చివేసిందని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమికి స్థానిక సంస్థల్లోనూ 75 శాతం నుంచి 92 శాతం వరకు ప్రజలు పట్టం కడుతున్నారని, దీంతో 'మూడు ఇంజన్ల సర్కార్' ద్వారా అభివృద్ధి మరింత ముందుకు సాగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన జీవనాన్ని కోరుకుంటున్నారని, ప్రజాస్వామ్యంలో దౌర్జన్యాలకు తావులేదని గద్దె రామ్మోహన్ రావు అన్నారు. గత పాలనలో జరిగిన హింసాత్మక ఘటనలు, ఏకగ్రీవాల కోసం చేసిన దౌర్జన్యాలను ప్రజలు పూర్తిగా వ్యతిరేకించారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైనా వైసీపీ నేతల్లో ఇంకా ఆత్మపరిశీలన కొరవడిందని, భయభ్రాంతులకు గురిచేసే ధోరణిని ప్రజలు నిరంతరం తిరస్కరిస్తూనే ఉంటారని విమర్శించారు.
ప్రజలు అందిస్తున్న ప్రతి విజయం తమ ప్రభుత్వంపై మరింత బాధ్యతను పెంచుతోందని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ రాబోయే రోజుల్లో మరింత మెరుగైన పాలన అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో కూటమికి అండగా నిలిచిన ఓటర్లకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.