- సందర్శకుల కోసం ప్రత్యేకంగా ప్రవేశ రుసుము నిర్ణయించే అవకాశం
- నాలుగు నెలల తర్వాత పీపీపీ విధానంలో స్టార్ హోటల్‌గా మార్పు
- టాటా, లీలా ప్యాలెస్ సహా 9 ప్రముఖ సంస్థల ఆసక్తి
- మరో 4 ఎకరాల్లో అదనంగా 150 గదుల నిర్మాణానికి ప్రతిపాదన
విశాఖపట్నంలోని రుషికొండపై గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన అత్యంత విలాసవంతమైన భవనాల సముదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రాంగణాన్ని రాబోయే నాలుగు నెలల పాటు (120 రోజులు) సాధారణ ప్రజలు, పర్యాటకుల సందర్శనార్థం తెరవాలని నిర్ణయించింది. ఆ తర్వాత పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలో అంతర్జాతీయ స్థాయి స్టార్ హోటల్ మార్చి ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం, రుషికొండ ప్యాలెస్‌ను లోపలికి వెళ్లి చూసేందుకు ప్రజలకు 120 రోజుల పాటు అనుమతి కల్పించనున్నారు. ఇందుకోసం టికెట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తుండగా, ప్రవేశ రుసుము ఎంత ఉండాలనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సందర్శన వేళలు, టికెట్ ధరలు ఖరారైన తర్వాత ప్రజలను అనుమతించనున్నారు. 120 రోజుల సందర్శన గడువు ముగిసిన అనంతరం, ఈ భవనాలను పూర్తిస్థాయి లగ్జరీ హోటల్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించనున్నారు.
ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు ఇప్పటికే ఆతిథ్య రంగంలోని దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. టాటా గ్రూప్, ది లీలా ప్యాలెస్, అట్మాస్ఫియర్ కోర్ వంటి ప్రముఖ సంస్థలతో కలిపి మొత్తం తొమ్మిది కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, పర్యాటక రంగాన్ని విస్తరించే ఉద్దేశంతో ఈ భవనాల సముదాయానికి అనుసంధానంగా మరో నాలుగు ఎకరాల భూమిని కూడా కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ అదనంగా దాదాపు 150 గదుల వరకు నిర్మించే వెసులుబాటు కల్పించనున్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రుషికొండ భవన సముదాయాన్ని నిర్మించారు. 2024 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు, అందులోని విలాసవంతమైన సౌకర్యాలు, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలతో తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ భవనాల నిర్వహణ కోసం ప్రతి నెలా సుమారు రూ.25 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖజానాపై నిర్వహణ భారాన్ని తగ్గించడంతో పాటు, ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ ఆస్తిని ఆదాయ వనరుగా మార్చేందుకు పీపీపీ విధానాన్ని ఎంచుకున్నారు. అటు సాధారణ పౌరులకు ఈ భవనాన్ని చూసే అవకాశం కల్పిస్తూనే, ఇటు పర్యాటక అభివృద్ధికి దోహదపడేలా ప్రైవేటు భాగస్వామ్యంతో సరికొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు.