- దక్షిణాది రాష్ట్రాల సీట్ల శాతం తగ్గకుండా 50 శాతం సీట్ల పెంపు ప్రతిపాదన
- మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలుకు ఇదే సరైన సమయమన్న ఏపీ సీఎం
- జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాదికి అన్యాయం జరగకూడదని స్పష్టీకరణ
- రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో సహకరించాలని విజ్ఞప్తి
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియలో జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్యను అన్ని రాష్ట్రాల్లో దామాషా ప్రకారం 50 శాతం పెంచడమే దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు, దేశ సమగ్రతకు సరైన పరిష్కారమని ఆయన పేర్కొన్నారు.
జనాభా నియంత్రణ చర్యల వల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్న ఆందోళన చాలా కాలంగా ఉందని చంద్రబాబు గుర్తుచేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేశామని, దానివల్ల ప్రస్తుతం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్) తగ్గిపోయిందని తెలిపారు. 1971 జనాభా ప్రాతిపదికన గతంలో సీట్ల సంఖ్యను స్తంభింపజేశారని, ఇప్పుడు కొత్తగా జనాభా ఆధారంగా మాత్రమే డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాల గళం తగ్గే ప్రమాదం ఉందని చెప్పారు. దీనికి పరిష్కారంగా ప్రతి రాష్ట్రంలో ప్రస్తుత సీట్ల సంఖ్య 50 శాతం పెంచితే, దక్షిణాది ప్రాతినిధ్యం అదే నిష్పత్తిలో కొనసాగుతుందని ఆయన వివరించారు. ఈ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో సీట్ల సంఖ్య 25 నుంచి 38కి, తమిళనాడులో 39 నుంచి 59కి, కర్ణాటకలో 28 నుంచి 42కి, తెలంగాణలో 17 నుంచి 26కి, కేరళలో 20 నుంచి 30కి పెరిగే అవకాశం ఉంటుందని, తద్వారా మొత్తం దక్షిణాది సీట్ల సంఖ్య 129 నుంచి 195కి చేరి ప్రస్తుత 23.76 శాతం నిష్పత్తి యథాతథంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.
అలాగే మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న 33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలు దిశగా అడుగులు పడటం స్వాగతించదగ్గ పరిణామమని చంద్రబాబు అన్నారు. 1996లో హెచ్.డి. దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా తాను ఈ బిల్లు ప్రవేశపెట్టే ప్రక్రియను ప్రత్యక్షంగా చూశానని, ఆ తర్వాత వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ పలు ప్రయత్నాలు జరిగాయని గుర్తుచేశారు. విద్య, ఐటీ, శాస్త్ర సాంకేతిక తదితర రంగాల్లో మహిళలు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని, చట్టసభల్లోనూ వారికి తగిన ప్రాధాన్యం దక్కాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా పాలనలో మంచి ఫలితాలు వచ్చాయని వివరించారు.
మొత్తం సీట్ల సంఖ్య 50 శాతం పెంచి, అందులో మహిళలకు 33 శాతం కేటాయించడం ద్వారా అటు పురుష ప్రజాప్రతినిధులకు ఇబ్బంది కలగకుండా, ఇటు మహిళలకు న్యాయం జరిగే సమతూకం సాధ్యమవుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇది దేశ ప్రయోజనాలకు సంబంధించిన చారిత్రక పరిణామమని, ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చి మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంట్లో గందరగోళం సృష్టించి బిల్లులను అడ్డుకోవడం సరికాదని, ప్రతి ఒక్కరూ విజ్ఞతతో వ్యవహరించి దేశ పురోగతికి తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.