- ఆంధ్రప్రదేశ్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ
- ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి విమర్శ
- పోలీసులు టీడీపీ కార్యకర్తలతో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణ
ఏపీలో జరుగుతున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ తీరుపై కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కడప జిల్లాలోని వేంపల్లి, పెండ్లిమర్రి, వీరబల్లి తదితర మండలాల్లో ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా సాగడం లేదని ఆయన విమర్శించారు.
ఎన్నికలు జరుగుతున్న తీరు చాలా బాధాకరంగా ఉందని, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ప్రక్రియను దెబ్బతీస్తున్నారని అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసులు టీడీపీ శ్రేణులకు సహకరిస్తూ తమ పార్టీ పోలింగ్ ఏజెంట్లను ఉదయాన్నే కేంద్రాల నుంచి బలవంతంగా బయటకు పంపించారని ఆయన ఆరోపించారు.
పలు ప్రాంతాల్లో ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుంటున్నారని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసే పరిస్థితి కనిపించడం లేదని ఆయన తెలిపారు. అలాగే వేంపల్లిలో వైసీపీ నేత సతీశ్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారని, పులివెందులలోని తన నివాసం నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్తుండగా తననూ పోలీసులు అడ్డుకున్నారని ఎంపీ పేర్కొన్నారు.
ఈ పరిణామాలపై జిల్లా ఎస్పీకి ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు ఎంపీ వెల్లడించారు. బోగస్ ఓట్లు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని పారదర్శకంగా పోలింగ్ జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.