- బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- ఫ్లాట్ కొనుగోలుదారులకు డిపాజిట్లు వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశం
- ఏడాది ముందే పనులు పూర్తయినా సకాలంలో సమాచారం ఇవ్వని బిల్డర్
- స్వల్ప వ్యవధి నోటీసుతో ఆర్థిక ప్రణాళికలు దెబ్బతిన్నాయన్న కొనుగోలుదారులు
- రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ మార్కెటింగ్ చట్టం ఉల్లంఘించినట్లు వెల్లడి
రియల్ ఎస్టేట్ రంగంలో సాధారణంగా నిర్మాణాల జాప్యం గురించే ఫిర్యాదులు వస్తుంటాయి. అయితే, ఒప్పందం కంటే ఏడాది ముందే ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి, ఆ విషయాన్ని కొనుగోలుదారులకు సకాలంలో చెప్పని ఓ డెవలపర్‌కు కెనడాలోని బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గడువు కంటే ముందే పనులు పూర్తి చేసినప్పటికీ, కొనుగోలుదారులకు తగినంత సమయం ఇవ్వకుండా సమాచారం దాచడం చట్ట ఉల్లంఘనేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒప్పందాలను రద్దు చేసుకుని, చెల్లించిన డిపాజిట్లను వడ్డీతో సహా తిరిగి పొందేందుకు ఆరుగురు ఫ్లాట్ కొనుగోలుదారులకు కోర్టు అనుమతినిచ్చింది.
లాంగ్లీ పరిధిలోని ఓ బహుళ అంతస్తుల ప్రాజెక్ట్‌లో ఫ్లాట్ల కోసం 2022 మార్చిలో ఆరుగురు కొనుగోలుదారులు 'వెస్టా ప్రాపర్టీస్ (లాటిమర్) లిమిటెడ్' సంస్థతో ప్రీ-సేల్ అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఫ్లాట్ల నిర్మాణం 2025 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య పూర్తవుతుందని బిల్డర్ పేర్కొన్నారు. అయితే, ప్రాజెక్ట్ వేగంగా పూర్తి కావడంతో డెవలపర్ ఆ గడువును ఏడాది ముందుకు జరిపి 2024 అక్టోబర్ - డిసెంబర్‌కు మార్చారు. ఇందుకు సంబంధించి 2024 ఫిబ్రవరి 29నే సంబంధిత నియంత్రణ సంస్థకు సవరణ పత్రాలు కూడా సమర్పించారు. కానీ, ఈ మార్పు విషయాన్ని మాత్రం కొనుగోలుదారులకు 2024 ఆగస్టు 28 వరకు తెలియజేయలేదు. అంటే, కొత్త గడువు మొదలయ్యేందుకు కేవలం నెల రోజుల ముందు మాత్రమే వారికి సమాచారం అందింది.
ఈ ఆకస్మిక మార్పుతో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఇంత స్వల్ప వ్యవధిలో హోమ్ లోన్ ఏర్పాట్లు చేసుకోవడం, స్ట్రాటా ఫీజులు, ఇతర నిర్వహణ ఖర్చులను సిద్ధం చేసుకోవడం సాధ్యం కాదని వారు వాపోయారు. బిల్డర్ తీరును సవాలు చేస్తూ బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. బిల్డర్ చర్య 'రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ మార్కెటింగ్ చట్టం'లోని సెక్షన్ 16ను ఉల్లంఘించడమేనని తేల్చింది. ఏడాది ముందే పనులు పూర్తి కావడం అనేది కొనుగోలుదారుల ఆర్థిక ప్రణాళికలను నేరుగా ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశమని కోర్టు స్పష్టం చేసింది.
ప్రాజెక్ట్ గడువు మారిన విషయాన్ని సహేతుకమైన సమయంలో కొనుగోలుదారులకు తెలియజేయకపోవడం వల్ల మునుపటి డిస్క్లోజర్ స్టేట్మెంట్ తప్పుదారి పట్టించేదిగా మారిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో చట్టంలోని సెక్షన్ 23(1) ప్రకారం కొనుగోలుదారులకు ఒప్పందాలను రద్దు చేసుకునే హక్కు ఉంటుందని, వారి డిపాజిట్లను వడ్డీతో సహా వెంటనే తిరిగి చెల్లించాలని ఆదేశించారు. అతి తక్కువ సమయంలో ఫ్లాట్లను స్వాధీనం చేసుకోవాలని కొనుగోలుదారులపై ఒత్తిడి తేవడాన్ని, వారు నిబంధనలు పాటించలేదని ఆరోపించడాన్ని కూడా న్యాయస్థానం తీవ్రంగా ఆక్షేపించింది.
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో ఎలాంటి మార్పులు జరిగినా బిల్డర్లు తప్పనిసరిగా సకాలంలో కొనుగోలుదారులకు పూర్తి వివరాలు అందించాలని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. గడువు ఆలస్యమైనా లేదా ముందే పూర్తయినా పారదర్శకత లోపిస్తే కొనుగోలుదారులు చట్టబద్ధంగా అగ్రిమెంట్లను రద్దు చేసుకునే అవకాశం ఉంటుందని ఈ ఉదంతం నిరూపించింది.