- నియోజకవర్గాల పునర్విభజన ఏపీకి ఎంతో ప్రయోజనకరమన్న సీఎం చంద్రబాబు
- దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలు 50 శాతం పెంపు ప్రతిపాదనకు సంపూర్ణ మద్దతు
- ప్రధాని మోదీ ఆహ్వానంతో దిల్లీకి బయలుదేరిన చంద్రబాబు
నియోజకవర్గాల పునర్విభజన ఆంధ్రప్రదేశ్‌కు ఒక మంచి అవకాశమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర పెంచే ప్రతిపాదన అన్ని రాష్ట్రాలకూ ప్రయోజనకరంగా ఉంటుందని రాష్ట్ర మంత్రివర్గానికి వివరించారు. రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిని 2051 వరకు యథాతథంగా కొనసాగించడం వల్ల ఎవరికీ అన్యాయం జరగదని తెలిపారు.
నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నందున, ఈ నెల 29 నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలంతా తప్పనిసరిగా ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నందున, ఈ నెల 29 నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలంతా తప్పనిసరిగా ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని ఆయన స్పష్టం చేశారు.