- రాజమండ్రి కోర్టు, బార్ అసోసియేషన్ చారిత్రక వేడుకల్లో చంద్రబాబు ప్రసంగం
- భారత్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థల పటిష్ఠతపై సీఎం ప్రశంసలు
- కోర్టు కేసుల వేగవంతమైన పరిష్కారానికి లీగల్ ఏఐ స్టాక్
- ప్రత్యామ్నాయ విధానాల ద్వారానే సత్వర న్యాయం సాధ్యమని ఉద్ఘాటన
- అమరావతికి అండగా నిలిచిన హైకోర్టు తీర్పుల ప్రస్తావన
- వచ్చే ఏడాది పోలవరం పూర్తి, గోదావరి పుష్కరాల నిర్వహణ.. న్యాయమూర్తులకు ఆహ్వానం
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొంటున్నప్పటికీ, భారతదేశంలో నాలుగు ప్రజాస్వామ్య వ్యవస్థలు బలంగా ఉండడం వల్లనే దేశం వాటన్నింటినీ తట్టుకుని స్థిరంగా ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థతో పాటు ప్రజాప్రతినిధుల వ్యవస్థ కూడా ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోర్టు 222 ఏళ్లు, రాజమండ్రి బార్ అసోసియేషన్ 131 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమహేంద్రవరంలో నిర్వహించిన వేడుకల్లో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ పి.నరసింహ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావుతో పాటు పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక సావనీర్‌ను ఆవిష్కరించిన సీఎం, సీనియర్ న్యాయవాదులు, విశ్రాంత న్యాయమూర్తులను ఘనంగా సత్కరించారు.
న్యాయ పాలనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. కోర్టు కేసుల నిర్వహణ, లీగల్ గవర్నెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే 'లీగల్ ఏఐ స్టాక్'ను అందుబాటులోకి తీసుకురానుందని ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆన్లైన్ లిటిగేషన్ కేస్ మేనేజ్మెంట్ ద్వారా 8.4 లక్షల కేసులను నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా కేసుల విశ్లేషణ, కౌంటర్ అఫిడవిట్ల రూపకల్పన, చట్టాలు, నిబంధనలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి తెస్తామని వివరించారు.
రాజ్యాంగ విలువలను కాపాడుతూ సామాన్యుడికి సకాలంలో న్యాయం అందించడమే అందరి లక్ష్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కోర్టుల్లో ఏళ్ల తరబడి కేసులు పెండింగ్‌లో ఉండకుండా లోక్ అదాలత్‌లు, ఆర్బిట్రేషన్, మధ్యవర్తిత్వం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం కూడా ప్రతివాదిగా ఉన్న వివాదాలను కోర్టుల సహకారంతో త్వరగా పరిష్కరించి ప్రజలకు ఊరట కల్పించాలనేది ప్రభుత్వ ఆలోచనగా చెప్పారు. పూర్వం తాటి ఆకులపై తీర్పులు రాసిన నాటి నుంచి నేడు ఏఐ పరిజ్ఞానం వాడే స్థాయికి న్యాయవ్యవస్థ ఎదగడం గొప్ప పరిణామమని అన్నారు. 1849లోనే అధికారిక గుర్తింపు పొందిన సీతానగరం రచ్చబండ ప్రజా కోర్టు చరిత్రను ఆయన గుర్తుచేశారు.
గతంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఇచ్చిన చారిత్రక తీర్పు రాజధాని అమరావతిని, రాష్ట్రాన్ని కాపాడిందని ముఖ్యమంత్రి ప్రశంసించారు. అలాగే ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ లీసా గిల్ చరిత్రలో నిలిచారని అభినందించారు.
దేశ 9వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు రాజమండ్రి బార్ అసోసియేషన్‌లోనే ప్రాక్టీస్ చేశారని, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి వీరులు ఇక్కడి నుంచే న్యాయవాద వృత్తిని చేపట్టారని గుర్తుచేసుకున్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో పాటు స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నామని, వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు. పుష్కరాల పవిత్ర స్నానాలకు రావాల్సిందిగా న్యాయమూర్తులను ఆయన సాదరంగా ఆహ్వానించారు.