- నారీశక్తికి ఇచ్చిన మాటను నెరవేర్చి తీరుతామన్న ప్రధాని మోదీ
- మహిళా రిజర్వేషన్ల మార్గంలో ఉన్న ప్రతి అడ్డంకిని తొలగిస్తామని స్పష్టీకరణ
- దశాబ్దాలుగా నానుతున్న బిల్లు సాధన కోసం తానూ శ్రమిస్తున్నానని వెల్లడి
- మహిళా సాధికారత విషయంలో తమ సంకల్పాన్ని ఎవరూ ఆపలేరని ప్రకటన
- దేశ మహిళా లోకం ఆశీస్సులు తమ ప్రభుత్వానికే ఉన్నాయని స్పష్టం
- చట్టసభల్లో మహిళల భాగస్వామ్యాన్ని విపక్షాలు అడ్డుకోలేవని హెచ్చరిక
దేశంలోని నారీశక్తికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తమ ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలులో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని తొలగిస్తామని హామీ ఇస్తూ ఆయన శనివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగకుండా ఏ శక్తీ అడ్డుకోలేదని తేల్చిచెప్పారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు దశాబ్దాలుగా పెండింగ్లో ఉందని ప్రధాని గుర్తుచేశారు. ఈ హక్కును సాధించడం కోసం నిరంతరం కృషి చేస్తున్న వారిలో తానూ ఒకడినని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది మహిళలు ఈ అంశాన్ని వ్యక్తిగతంగా తన దృష్టికి తెచ్చారని, లెక్కలేనన్ని ఉత్తరాలు రాసి తమ ఆకాంక్షలను పంచుకున్నారని తెలిపారు. దేశంలోని నారీశక్తి ఆశీస్సులు, సంపూర్ణ మద్దతు తమ ప్రభుత్వానికే ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మహిళలకు చట్టసభల్లో సముచిత వాటా కల్పించే విషయంలో తమ దృఢ సంకల్పాన్ని ఎవరూ ఆపలేరని ప్రధాని హెచ్చరించారు. ఈ బిల్లును వ్యతిరేకించే రాజకీయ పార్టీలు అసెంబ్లీలు, పార్లమెంట్లో మహిళల భాగస్వామ్యాన్ని ఎప్పటికీ అడ్డుకోలేవని స్పష్టం చేశారు. మహిళల రాజకీయ ప్రాతినిధ్యం మరింత పెరగడం కేవలం కొద్దిరోజుల వ్యవధి మాత్రమేనని, ఇచ్చిన మాట ప్రకారం మహిళా సాధికారతను త్వరలోనే సంపూర్ణంగా సాకారం చేస్తామని ప్రధాని తేల్చిచెప్పారు.