- మల్లయ్యపేట పోలింగ్ బూత్ వద్ద బీజేపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
- వైసీపీ శ్రేణులు పోలింగ్ కేంద్రానికి గుంపులుగా రావడంతో వివాదం
- ప్రత్యర్థి శ్రేణులకు తొడకొట్టి బహిరంగ సవాల్ విసిరిన సోము వీర్రాజు
- పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీస్ బలగాలు
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ వేళ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 62వ డివిజన్ పరిధిలోని మల్లయ్యపేట పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, బీజేపీ శ్రేణులు పరస్పరం బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలింగ్ కేంద్రం సమీపంలోకి వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకోవడంపై అక్కడే ఉన్న బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలింగ్ కేంద్రం పరిసరాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ శ్రేణులపై సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. కావాలనే తమ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. దమ్ముంటే ఎవరైనా తమ మీదకు రావాలంటూ తొడగొట్టి సవాల్ విసిరారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఈ క్రమంలో ఆయన పోలీసుల తీరును సైతం విమర్శించారు.
ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా రావడంతో పోలింగ్ కేంద్రం ప్రాంగణంలో గందరగోళం చెలరేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.