- 2029లో లోక్‌సభతో పాటే అసెంబ్లీ ఎన్నిలూ ఉంటాయన్న లక్ష్మణ్
- డీలిమిటేషన్‌తో అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెంపు తథ్యమన్న ఎంపీ
- 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' బిల్లు 2027లో ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న బీజేపీ నేత
- దక్షిణాదికి నష్టం జరగకుండానే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందన్న లక్ష్మణ్
తెలంగాణలో శాసనసభ గడువు ముగిశాక, సుమారు ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కన్వీనర్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2028 డిసెంబరుతో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగుస్తుందని, ఆ తర్వాత 2029 మే లేదా జూన్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే సూచనలున్నాయని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో పాలనాపరమైన అవసరాల దృష్ట్యా రాష్ట్రపతి పాలన అనివార్యం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' విధానాన్ని దశలవారీగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని లక్ష్మణ్ తెలిపారు. ఇందులో భాగంగా 2027లో 'జమిలి ఎన్నికల' బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ఆలోచన ఉందని చెప్పారు. తొలి దశలో భాగంగా, అసెంబ్లీ గడువు ఏడాది అటూఇటూగా ఉన్న 17 రాష్ట్రాలకు లోక్‌సభతో కలిపి ఎన్నికలు నిర్వహించవచ్చని, ఆ జాబితాలో తెలంగాణ కూడా ఉంటుందని స్పష్టం చేశారు. తరచూ ఎన్నికల వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని, బోధన కుంటుపడుతోందని, ఈ సమస్యల పరిష్కారానికే జమిలి ఎన్నికలు అవసరమని ఆయన అన్నారు.
త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన), మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందుతాయని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. డీలిమిటేషన్‌పై కొన్ని వర్గాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా, ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సీట్ల సంఖ్యకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెంచాలని కేంద్రం నిర్ణయించిందని, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని హామీ ఇచ్చారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, చనిపోయిన వారి పేర్లు, డూప్లికేట్ ఓట్లను తొలగించడం వల్లే ఓట్ల సంఖ్య తగ్గిందన్నారు. హైదరాబాద్‌లో దాదాపు 45 శాతం బోగస్ ఓట్లు తొలగించారని, దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల్లో పసలేదని, ఆధారాలు చూపడంలో విఫలమయ్యారని విమర్శించారు. కాగా, ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో సైకిల్ యాత్ర నిర్వహించనున్నట్లు లక్ష్మణ్ తెలిపారు.