- కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్న కేటీఆర్
- సాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీ 90 టీఎంసీల నీటి మళ్లింపునకు యత్నిస్తోందని ఆరోపణ
- జల్ జీవన్ మిషన్ పేరుతో నీటి వినియోగానికి కేంద్రం సహకరిస్తోందని విమర్శ
తెలంగాణ సాగునీటి, తాగునీటి ప్రయోజనాలను దెబ్బతీసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ... నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి దాదాపు 90 టీఎంసీల కృష్ణా నది నీటిని మళ్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ ప్రక్రియకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరోక్ష సహకారం ఉంటోందని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి మోదీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరు వల్ల తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతోందని ఆయన విమర్శించారు. జల్ జీవన్ మిషన్ పేరుతో ఏపీ చేపడుతున్న నీటి వినియోగానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తోందని మండిపడ్డారు. గతంలో ఆంధ్ర పాలకుల కంటే రేవంత్ రెడ్డి పాలనలోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరుగుతోందని అన్నారు.
సాగర్ ప్రాజెక్టు వద్ద గత ఏడాది కాలంగా జరుగుతున్న పనులపై తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం లేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఏపీ నీటి మళ్లింపు యత్నాలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు (కేఆర్ఎంబీ) అధికారికంగా ఏమైనా ఫిర్యాదు చేశారా? అని నిలదీశారు. అలాగే రాష్ట్ర తాగునీటి అవసరాల నిమిత్తం మిగిలిన 40 టీఎంసీల కేటాయింపులను కోరుతూ ప్రభుత్వం వెంటనే కేఆర్ఎంబీకి లేఖ రాయాలని అన్నారు.