- ఐపీఎల్ 2027 నుంచి తప్పుకోవాలని ట్రావిస్ హెడ్ నిర్ణయం
- హెడ్‌ను ఎస్‌ఆర్‌హెచ్ రిలీజ్ చేయడంతో విడిపోయిన 'ట్రావిషెక్' జోడీ
- సహచర ఓపెనర్ హెడ్‌కు అభిషేక్ శర్మ సోషల్ మీడియాలో కృతజ్ఞతలు
- వీరిద్దరూ కలిసి లీగ్‌లో 12.46 రన్ రేట్‌తో 1,892 పరుగుల పార్ట్నర్షిప్
- ఎస్‌ఆర్‌హెచ్ ముందు కొత్త ఓపెనర్ ఎంపిక సవాల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విధ్వంసకర జోడీగా పేరుగాంచిన ‘ట్రావిషెక్’ ప్రయాణానికి తెరపడింది. అంతర్జాతీయ క్రికెట్ ప్రాధాన్యతలు, కుటుంబం కోసం సమయం కేటాయించడం దృష్ట్యా ఐపీఎల్ 2027 సీజన్ నుంచి తప్పుకోవాలని ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ నిర్ణయించుకున్నాడు. దీంతో వచ్చే సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టు హెడ్‌ను రిటైన్ చేసుకోకుండా విడుదల చేసింది. దీంతో సరికొత్త విధ్వంసానికి చిరునామాగా నిలిచిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ ద్వయం రాబోయే సీజన్‌లో కనిపించదు.
తన సహచర ఓపెనర్ నిష్క్రమణపై భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ భావోద్వేగపూరితంగా స్పందించాడు. హెడ్‌తో కలిసి మైదానంలో ఆడిన రోజులను గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు. "అన్నింటికీ థాంక్యూ హెడీ" అంటూ ఆత్మీయ సందేశాన్ని పంచుకున్నాడు. హెడ్‌తో భాగస్వామ్యంలో అభిషేక్ బ్యాటింగ్ శైలి ఎంతగానో మెరుగపడటంతో పాటు లీగ్‌లో డేంజరస్ ఓపెనర్‌గా ఎదిగాడు.
సన్‌రైజర్స్ తరఫున 43 మ్యాచ్‌లు ఆడిన హెడ్ 176.14 స్ట్రైక్ రేట్‌తో 1,351 పరుగులు సాధించాడు. వీరిద్దరూ కలిసి 42 ఇన్నింగ్స్‌లలో 46.14 సగటుతో 1,892 పరుగులు జోడించాడు. ఇందులో ఆరు సెంచరీ భాగస్వామ్యాలు, తొమ్మిది హాఫ్ సెంచరీ పార్టనర్‌షిప్‌లు ఉన్నాయి. ఎస్‌ఆర్‌హెచ్ చరిత్రలో ధావన్-వార్నర్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఓపెనింగ్ జోడీ ఇదే కావడం విశేషం. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో 1,000 కంటే ఎక్కువ పరుగులు సాధించిన ఏ భాగస్వామ్యానికైనా లేని విధంగా, వీరిద్దరూ ఓవర్‌కు 12.46 రన్ రేట్‌తో పరుగులు రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించారు.
కుటుంబానికి సమయం కేటాయించడంతో పాటు కెరీర్ పరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెడ్ వెల్లడించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో గడిపిన మూడేళ్ల ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుందని, సాధించిన విజయాలపై ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. హెడ్ నిష్క్రమణతో డిసెంబర్ 16న జరిగే ఐపీఎల్ 2027 వేలంలో అభిషేక్ శర్మకు తోడుగా కొత్త ఓపెనర్‌ను వెతకడం సన్‌రైజర్స్ యాజమాన్యానికి పెద్ద సవాలుగా మారనుంది.