- ఐపీఎల్ ప్లేయర్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీ
- చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు 2027 సీజన్ నుంచి మెంటార్‌గా వ్యవహరించనున్న ధోనీ
- ధోనీతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న రోహిత్ శర్మ
భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ఎంఎస్ ధోనీ ఇండియన్ ఐపీఎల్ కు గుడ్ బై చెప్పారు. అయితే, ప్లేయర్‌గా మైదానాన్ని వీడినప్పటికీ, సీఎస్‌కేతో ఆయన ప్రయాణం మరో రూపంలో కొనసాగనుంది. 2027 ఐపీఎల్ సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ‘టీమ్ మెంటార్’గా ధోనీ సరికొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియకు ముందు, తనను ప్లేయర్ కాంట్రాక్ట్ నుంచి రిలీజ్ చేయాలని ధోనీ స్వయంగా కోరడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.
ధోనీ నిర్ణయంపై భారత క్రికెటర్ రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అద్భుతమైన ఐపీఎల్ ప్రయాణం సాగించిన ధోనీ భాయ్‌కి అభినందనలు. నీతో కలిసి మైదానంలో, వెలుపల పంచుకున్న జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నీపై ఉండే గౌరవం ఎప్పటికీ తగ్గదు’’ అంటూ రోహిత్ పేర్కొన్నారు.
మరోవైపు, సీఎస్‌కే అధినేత ఎన్. శ్రీనివాసన్ స్పందిస్తూ... ధోనీ లేని చెన్నై సూపర్ కింగ్స్‌ను ఊహించలేమని, ఇది ఎప్పటికీ ఆయన ఇల్లేనని స్పష్టం చేశారు. జట్టు పరివర్తన దశలో ఉన్న తరుణంలో తర్వాతి తరం ఆటగాళ్లను తీర్చిదిద్దేందుకు ధోనీ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎస్‌కే సహ యజమాని రూపా గురునాథ్ పేర్కొన్నారు.