- ఐపీఎల్ 2027 రిటెన్షన్ల కోసం పది జట్లు కలిసి రూ.1,002.05 కోట్లు ఖర్చు
- డిసెంబర్ 16న గోవాలో జరిగే వేలం కోసం జట్ల వద్ద రూ.297.95 కోట్లు
- మొత్తం 66 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉన్న వైనం
- లక్నో అత్యధికంగా రూ.47.45 కోట్ల పర్స్‌తో వేలానికి
- కేకేఆర్ వద్ద రూ.41.65 కోట్లు, ఎస్ఆర్హెచ్ వద్ద రూ.40.15 కోట్లు
ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ ముగియడంతో వేలం సందడి మొదలైంది. పది ఫ్రాంచైజీలు కేవలం రిటెన్షన్ల కోసమే ఏకంగా రూ.1,002.05 కోట్లు ఖర్చు చేశాయి. దీంతో వచ్చే నెల డిసెంబర్ 16న గోవాలో జరగనున్న మినీ వేలానికి అన్ని జట్ల వద్ద కలిపి మొత్తం రూ.297.95 కోట్ల పర్స్ మాత్రమే మిగిలింది. రాబోయే సీజన్ కోసం జట్లను పటిష్ఠం చేసుకునే క్రమంలో 25 విదేశీ స్థానాలతో కలిపి మొత్తం 66 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది.
ట్రేడింగ్ గడువు ముగిసే సమయానికి కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) స్టార్ పేసర్ మహమ్మద్ షమీ, మణిమారన్ సిద్ధార్థ్‌లను రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చి, వారి నుంచి శామ్ కరన్‌ను తీసుకుంది. మరోవైపు రెండుసార్లు పర్పుల్ క్యాప్ విజేత అయిన హర్షల్ పటేల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి గుజరాత్ టైటాన్స్ గూటికి చేరాడు. గుజరాత్ అత్యధికంగా 22 మందిని నిలుపుకోగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏడుగురు విదేశీ ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. చెన్నై, పంజాబ్, రాజస్థాన్ జట్లు 19 మంది చొప్పున రిటైన్ చేసుకున్నాయి.
వేలంలో అత్యధిక పర్స్‌తో బరిలోకి దిగుతున్న జట్లలో లక్నో సూపర్ జెయింట్స్ అగ్రస్థానంలో ఉంది. 18 మందిని అట్టిపెట్టుకున్న లక్నో వద్ద గరిష్ఠంగా రూ.47.45 కోట్లు ఉన్నాయి. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ వద్ద రూ.41.65 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ.40.15 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో రూ.39.50 కోట్లు అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువగా గుజరాత్ టైటాన్స్ వద్ద కేవలం రూ.8.75 కోట్లు మాత్రమే మిగిలాయి. ఆ జట్టుకు కేవలం మూడు ఖాళీలు మాత్రమే ఉన్నాయి.
జట్ల వారీగా చూస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, శివం దూబె, సర్ఫరాజ్ ఖాన్‌లతో పాటు లియామ్ లివింగ్‌స్టోన్, డెవాల్డ్ బ్రెవిస్ వంటి విదేశీ ఆటగాళ్లను ఉంచుకుంది. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్‌లను రిటైన్ చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, భువనేశ్వర్ కుమార్, ఫిల్ సాల్ట్‌లను నిలుపుకోగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ పాట్ కమిన్స్, క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మల కోర్‌ను కాపాడుకుంది.