- హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని నిలదీసిన కేటీఆర్
- కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో అబద్ధాల పుట్ట అంటూ ఎక్స్ వేదికగా ధ్వజం
- 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీల అమలుపై సూటి ప్రశ్నలు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో రాష్ట్ర ప్రజలకు రాహుల్ గాంధీ వెంటనే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ‘అభయ హస్తం’ పచ్చి అబద్ధాల పుట్ట అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో హైదరాబాద్లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ... కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీసీ డిక్లరేషన్లో భాగంగా రూ. 1 లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి, మూడేళ్లలో రూ. 5,000 కోట్లు కూడా కేటాయించలేదని కేటీఆర్ ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీని కూడా గాలికి వదిలేశారని మండిపడ్డారు.
అలాగే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి, కేవలం 10 వేల ఉద్యోగాలతో సరిపెట్టారని విమర్శించారు. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డులు, పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షల చొప్పున ఇచ్చే అంబేడ్కర్ అభయ హస్తం సాయం, మైనార్టీల నిధుల కేటాయింపుల్లోనూ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులు, రైతుల సమస్యలపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ నిలదీశారు.