- నిరుద్యోగులపై దాడులు, హైడ్రా కూల్చివేతలపై రాహుల్ ఎందుకు మాట్లాడరన్న కేటీఆర్
- భారత్ సమ్మిట్ కోసం రూ.100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపణ
- బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరిగినా స్పందించలేదని విమర్శ
హైదరాబాద్‌లో జరిగే ‘భారత్ సమ్మిట్ 2026’లో పాల్గొనేందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పర్యటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఎక్స్’ వేదికగా రాహుల్ గాంధీకి పలు సూటి ప్రశ్నలు సంధిస్తూ విమర్శలు గుప్పించారు.
ఉద్యోగాల కోసం పోరాడుతున్న నిరుద్యోగ యువతపై కాంగ్రెస్ పోలీసులు దాడులు చేసినప్పుడు రాహుల్ ఎక్కడున్నారని కేటీఆర్ నిలదీశారు. లగచర్లలో గిరిజన మహిళలపై దాడులు జరిగినప్పుడు, హైడ్రా బుల్డోజర్లతో సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తుంటే రాహుల్ ఢిల్లీలో నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు. కంచ గచ్చిబౌలి హెచ్‌సీయూ భూముల్లో వేలాది చెట్లను నరికివేయడం, 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడం, అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన దాడి ఘటనలపై రాహుల్ ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు. తెలంగాణ ప్రజల సొమ్ము దాదాపు రూ. 100 కోట్లతో ఈ ప్రచార ఆర్భాటం చేస్తున్నారని ఆరోపించారు.