- సొంత సంపాదనతోనే ఖర్చులు.. పేరెంటింగ్ పాఠాలు పంచుకున్న వీరేంద్ర సెహ్వాగ్
- క్రికెట్ ద్వారా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు సంపాదిస్తున్న సెహ్వాగ్ కుమారులు
- సొంత సంపాదనతో రూ.7 వేల పెట్రోల్ బిల్లు కట్టి డబ్బు విలువ తెలుసుకున్న వైనం
పిల్లలకు డబ్బు విలువ తెలియజేయడంపై భారత మాజీ స్టార్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ఆలోచనలను పంచుకున్నారు. తన కుమారులు ఆర్యవీర్, వేదాంత్ క్రికెట్ ద్వారా సొంతంగా సంపాదిస్తూ ఆర్థిక బాధ్యతను అలవర్చుకుంటున్నారని ఆయన తెలిపారు. డిజిటల్ క్రియేటర్ నేహా బేడీ నిర్వహించిన ‘ది లైఫ్ సేవర్స్ షో’లో సెహ్వాగ్ ఈ విషయాలను వెల్లడించారు.
ప్రస్తుతం ఆర్యవీర్ అండర్-19 స్థాయిలో, వేదాంత్ అండర్-16 స్థాయిలో క్రికెట్ ఆడుతున్నారని, వారు సుమారు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు సంపాదిస్తున్నారని సెహ్వాగ్ చెప్పారు. ఒక సందర్భంలో కారుకు రూ.7,000 పెట్రోల్ బిల్లును కుమారుడే తన సంపాదన నుంచి కట్టాల్సి వచ్చిందని... ఆ సమయంలోనే అతనికి ఖర్చుల తీవ్రత అర్థమైందని వీరూ గుర్తు చేసుకున్నారు. తాను చెల్లించినప్పుడు లెక్కలేనితనం ఉన్నా, సొంత జేబులోంచి డబ్బులు పోయినప్పుడే ఆ అనుభవం వారికి తెలిసివచ్చిందని అన్నారు. లగ్జరీ కార్లు, వాచ్‌ల వంటి ఆడంబరాల కోసం పాకులాడకుండా, కష్టపడి నిజమైన గౌరవాన్ని సంపాదించుకోవాలని పిల్లలకు చెబుతుంటానని వివరించారు.
తన రికార్డులతో పోలికలు రావడం సహజమని, వాటిని పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టాలని కుమారులకు సూచిస్తున్నట్లు సెహ్వాగ్ పేర్కొన్నారు. పెద్ద కుమారుడు ఆర్యవీర్ ఇప్పటికే క్రికెట్‌లో సత్తా చాటుతున్నాడు.