- ఖాజాగూడ భూదోపిడీ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్న దాసోజు శ్రవణ్
- సాస్ ఇన్‌ఫ్రాకు భూ కేటాయింపులపై హైకోర్టు విచారణ జరపాలని డిమాండ్
- రేవంత్ ప్రభుత్వం బీసీలకు చారిత్రక ద్రోహం చేసిందని మండిపాటు
హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలో సుమారు రూ.1,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అక్రమ బదిలీ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నేత కురువ విజయ్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేయాల్సిన స్టడీ సర్కిల్ స్థలాన్ని ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థ ‘సాస్ ఇన్‌ఫ్రా’కు (SAS Infra) కట్టబెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చారిత్రక ద్రోహం చేసిందని ఆయన మండిపడ్డారు.
ఖాజాగూడలోని సర్వే నంబర్ 20/1లో ఉన్న 3.17 ఎకరాల స్థలాన్ని 2013లో అప్పటి ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిల్ కోసం కేటాయించిందని దాసోజు శ్రవణ్ గుర్తుచేశారు. ఈ భూమిని సాస్ ఇన్‌ఫ్రా ఆక్రమించిందని 2020 జనవరిలోనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నిర్ధారించి, రూ.1.93 కోట్ల జరిమానా విధించారని తెలిపారు. అనంతరం ఈ భూమిని 22-ఏ నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చినప్పటికీ, 2026 జూన్‌లో సదరు సంస్థకు రిజిస్ట్రేషన్లు, నిర్మాణ అనుమతులు ఎలా మంజూరు చేశారని ఆయన నిలదీశారు.
"శేరిలింగంపల్లి ఖాజాగూడ గ్రామంలో ఉన్న అత్యంత ఖరీదైన భూమిని సాస్ ఇన్‌ఫ్రాకు దోచిపెట్టారు. మరి వీళ్లు ఎవరికి చుట్టమో. ఏ లోపాయికారి ఒప్పందాలు ప్రభుత్వ పెద్దలతో ఉన్నాయో విచారణలో బహిర్గతం కావాల్సిన అవసరముంది. వీళ్లేమైనా తెలంగాణ ప్రజలకు అల్లుళ్లా?" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతోపాటు గచ్చిబౌలిలోని టీజీ లిప్కోకు చెందిన సుమారు రూ.6,000 కోట్ల విలువైన స్థలాన్ని కూడా ఇతర ప్రైవేటు సంస్థలకు అప్పగించారని ఆరోపించారు. ఖాజాగూడ భూ వ్యవహారంపై హైకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర విచారణ జరిపించాలని, సాస్ ఇన్‌ఫ్రాకు ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేసి, భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.