- విమాన టికెట్ల పేరుతో సినీ నటి అనితా చౌదరికి సైబర్ కేటుగాళ్ల బురిడీ
- అనిత ఖాతా నుంచి రూ.4.14 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
- బిజినెస్ క్లాస్ టికెట్ అని నమ్మించి సినీ నటికి భారీ సైబర్ మోసం
విమాన టికెట్లు తక్కువ ధరకే బుక్ చేస్తామంటూ నమ్మించి, సినీ నటి గోగినేని అనిత (అనితా చౌదరి)ని సైబర్ కేటుగాళ్లు మోసగించారు. బిజినెస్ క్లాస్ టికెట్ పేరుతో ఆమె బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ.4,14,180 కాజేశారు. బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మాదాపూర్ కావూరి హిల్స్‌లో నివాసం ఉంటున్న నటి అనిత, అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న తన కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం విమాన టికెట్లు బుక్ చేసుకునేందుకు నవంబర్ 12న ఆమె ఆన్లైన్లో ట్రావెల్ ఏజెన్సీల కోసం వెతికారు. ఈ క్రమంలో ‘లో ఫ్లై టూర్స్ అండ్ ట్రావెల్స్’ పేరిట రాజేశ్ అనే వ్యక్తి ఆమెను సంప్రదించాడు. వాషింగ్టన్ ప్రయాణానికి తమ వద్ద బిజినెస్ క్లాస్ టికెట్లు తక్కువ ధరకే లభిస్తాయని నమ్మబలికాడు.
రౌండ్ ట్రిప్ టికెట్ ధర రూ.4,14,180 అవుతుందని చెప్పి, బుకింగ్ నిమిత్తం డెబిట్ కార్డు వివరాలు ఇవ్వాలని కోరాడు. అతడి మాటలను నమ్మిన అనిత తన కార్డు వివరాలను అందించారు. ఆ తర్వాత టికెట్ ప్రాసెసింగ్ కోసమంటూ ఆమె మొబైల్ ఫోన్‌కు వచ్చిన ఓటీపీలను (OTP) కూడా అడిగి తీసుకున్నాడు. ఆమె ఓటీపీ చెప్పిన వెంటనే క్లియర్‌ట్రిప్ ద్వారా ఖాతా నుంచి రూ.4,14,180 డెబిట్ అయ్యాయి. అయితే, ఎంతసేపటికీ టికెట్ కన్ఫర్మేషన్ రాకపోవడంతో పాటు సదరు వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయినట్లు ఆమె గ్రహించారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడు రాజేశ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆన్లైన్లో ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని పోలీసులు ఈ సందర్భంగా సూచించారు.