- సాఫ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో గెలిచిన భారత్
- భారత జట్టుకు మైదానంలో ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ ఇచ్చిన పాకిస్థాన్ ఆటగాళ్లు
- ఓటమి బాధలో ఉన్న ప్రత్యర్థులను ఓదార్చిన భారత్
- భారత ఆటగాళ్లు వారితో కరచాలనం చేసి క్రీడాస్ఫూర్తి ప్రదర్శన
సాఫ్ ఛాంపియన్షిప్ 2026 ఫైనల్ పోరు ముగిసిన తర్వాత మైదానంలో ఇరు జట్లు ప్రదర్శించిన అద్భుత క్రీడాస్ఫూర్తి క్రీడాభిమానుల హృదయాలను గెలుచుకుంది. టైటిల్ చేజారిన బాధలో ఉన్న పాకిస్థాన్ ఆటగాళ్లను భారత జట్టు ఓదార్చగా, పాక్ జట్టు ఊహించని రీతిలో స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచింది. విజేతగా నిలిచిన భారత ఆటగాళ్లకు మైదానంలో వరుసగా నిలబడి ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ ఇచ్చి తమ ఉన్నత వ్యక్తిత్వాన్ని చాటుకుంది.
న్యూకాసిల్ యునైటెడ్ మాజీ మిడ్‌ఫీల్డర్ నొల్బెర్టో సొలానో కోచింగ్‌లో తొలిసారి ఫైనల్ చేరిన పాకిస్థాన్ జట్టు ఇచ్చిన ఈ గౌరవాన్ని టీమిండియా ఆటగాళ్లు మనస్ఫూర్తిగా స్వీకరించారు. ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం చేస్తూ ఆత్మీయంగా స్పందించారు. ఈ అపురూప దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఢాకాలోని నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ తుది సమరంలో భారత్ 2-1 గోల్స్ తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి రికార్డు స్థాయిలో పదోసారి సాఫ్ ఛాంపియన్షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తొలి అర్ధభాగంలో ఆలంగీర్ ఘాజీ గోల్‌తో పాక్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో అర్ధభాగంలో బ్రిసన్ ఫెర్నాండెజ్‌పై దురుసు ప్రవర్తన కారణంగా పాక్ ఆటగాడు జునైద్ షా రెడ్ కార్డుతో మైదానం వీడాడు.
ఆ వెంటనే భారత్ తరఫున సుహైల్ అహ్మద్ భట్ గోల్ చేసి స్కోరును సమం చేశాడు. సుహైల్ టోర్నీలో నాలుగు గోల్స్ చేసి గోల్డెన్ బూట్, బెస్ట్ ప్లేయర్ అవార్డులు సాధించాడు. ఆట ముగియడానికి రెండు నిమిషాలు ఉందనగా 88వ నిమిషంలో సందీప్ మండి హెడ్డర్ గోల్‌తో భారత్ విజయాన్ని ఖాయం చేసింది. వరుసగా మూడుసార్లు సాఫ్ ట్రోఫీని కైవసం చేసుకుని భారత్ సరికొత్త చరిత్ర లిఖించింది.