- కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ ధర్నా
- 3.15 ఎకరాల స్థలం వేలాన్ని నిరసిస్తూ స్థానికులతో కలిసి ఆందోళన
- ధర్నాలో పాల్గొన్న హరీశ్ రావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
- నిరసనకు మద్దతు ప్రకటించిన వామపక్ష పార్టీలు
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూములను వేలం వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాయి. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నిరసనకు సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి.
కూకట్‌పల్లిలో ప్రజావసరాల కోసం కేటాయించిన 3.15 ఎకరాల ట్రక్ పార్క్ స్థలాన్ని ఈ నెల 27న ప్రభుత్వం వేలం వేసేందుకు సన్నాహాలు చేస్తుండటంతో ఈ నిరసన మొదలైంది. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందలతో కలిసి హరీశ్ రావు ట్రక్ పార్క్ స్థలాన్ని పరిశీలించి, స్థానిక ప్రజలతో మాట్లాడారు. భూముల వేలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని వారికి భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "ట్రక్ పార్క్ భూములు అమ్మితే ఊరుకోం. భూములు అమ్మడమే ప్రభుత్వ పనా? ఎక్కడ భూమి కనబడినా అమ్ముడేనా? రేవంత్ రెడ్డి పాలన కాకుండా.. రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇంచు భూమి కూడా అమ్మబోమని చెప్పారు. ఇప్పుడు భూములు అమ్మడమే పనిగా పెట్టుకున్నారు. కాప్రా, అమీన్‌పూర్‌లలో కూడా ప్రభుత్వ స్థలాలను విక్రయిస్తున్నారు" అని ఆయన మండిపడ్డారు.
గతంలో 2013లోనూ ఇదే భూమిని విక్రయించేందుకు ప్రయత్నించినప్పుడు రాజకీయ పక్షాలన్నీ ఏకమై అడ్డుకున్నాయని నేతలు పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే స్థలాలను వ్యాపార ప్రయోజనాల కోసం అమ్మడం సరికాదని, ప్రభుత్వం వెంటనే ఈ వేలాన్ని విరమించుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.