తెలంగాణలో గిగ్‌ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రత కోసం రూపొందించిన ప్రత్యేక పాలసీని శనివారం (నవంబరు 14) నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో దాదాపు ఆరు లక్షల మంది గిగ్‌ వర్కర్లకు ఈ విధానం ద్వారా ప్రయోజనం కల్పించనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడిన సీఎం.. గిగ్‌ వర్కర్ల సమక్షంలో ఈ పాలసీని ప్రకటించేందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని రాష్ట్రానికి ఆహ్వానించినట్లు వెల్లడించారు. భారత్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు రాహుల్‌ గాంధీ శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారు. శనివారం ఆయన గిగ్‌ వర్కర్లతో సమావేశం కానున్నారు.

ఈ సందర్భంగా గిగ్‌ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రత కోసం ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలు, సంక్షేమ పథకాలను రాహుల్‌ గాంధీ ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని లక్షలాది మంది గిగ్‌ వర్కర్లకు భరోసా కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం అమలుకు అవసరమైన నిబంధనలు, పథకాలను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది.