- 1,600 ఉపగ్రహాలతో బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ నిర్మించాలని రిలయన్స్ గ్రూప్ యోచన
- 2035 నాటికి ఎల్ఈవో వ్యవస్థను పూర్తి చేయడానికి దేశీయ, అంతర్జాతీయ సంస్థలతో చర్చలు
- యూఎస్ నుంచి 400 ఉపగ్రహాలు కొనుగోలు చేయనున్నట్లు సమాచారం
- సెప్టెంబర్ 2027లో తొలి ప్రయోగాత్మక పరీక్ష
- దేశీయ కనెక్టివిటీ, సరిహద్దు రక్షణ అవసరాల కోసమే ఈ నెట్వర్క్
ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌కు భారతీయ ప్రత్యామ్నాయాన్ని సృష్టించేందుకు రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ భారీ ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు. అంతరిక్షం నుంచి హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు 1,600 ఉపగ్రహాలతో కూడిన లో-ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈవో) వ్యవస్థను నిర్మించాలని రిలయన్స్ భావిస్తోంది. ఈ భారీ లక్ష్యం కోసం దేశీయ, అంతర్జాతీయ తయారీ సంస్థలతో రిలయన్స్ గ్రూప్ భాగస్వామ్య చర్చలు జరుపుతోందని బ్లూమ్‌బెర్గ్ కథనం వెల్లడించింది.
ఇటీవల లిస్టయిన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ వృద్ధికి తోడ్పాటుగా ఈ ఉపగ్రహ నెట్‌వర్క్‌ను 2035 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం భారతీయ ఉపగ్రహ తయారీదారులు, సాంకేతిక స్టార్టప్‌లతో పాటు పెద్ద పారిశ్రామిక గ్రూపులతో రిలయన్స్ సంప్రదింపులు జరుపుతోంది. అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు సమకూర్చేందుకు సైతం సిద్ధమైంది. ప్రస్తుతం భారత్ ఏడాదికి 15 కంటే తక్కువ ఉపగ్రహాలను మాత్రమే తయారు చేస్తోంది. అయితే రిలయన్స్ ప్రణాళిక ప్రకారం ఏటా దాదాపు 200 ఉపగ్రహాలను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది.
ఈ ప్రాజెక్టులో దేశీయ తయారీతో పాటు విదేశీ దిగుమతులనూ జోడించాలని రిలయన్స్ యోచిస్తోంది. అమెరికా నుంచి కనీసం 400 ఉపగ్రహాలను సేకరించాలని భావిస్తున్న సంస్థ, ఇప్పటికే రెండు యూఎస్ కంపెనీలతో పాటు యూరప్ సరఫరాదారులతో చర్చలు జరుపుతోంది. అయితే చైనా సంస్థలను మాత్రం ఈ జాబితా నుంచి పూర్తిగా మినహాయించింది. సెప్టెంబర్ 2027లో తొలి ప్రయోగాత్మక పరీక్ష నిర్వహించి, 2028 ఆరంభం నుంచి ఉపగ్రహాల ప్రయోగాలను విస్తరించాలని నిర్ణయించింది.
స్టార్‌లింక్‌కు ప్రపంచవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ ఉపగ్రహాలు ఉన్నప్పటికీ.. రిలయన్స్ ప్రధానంగా భారతీయ కనెక్టివిటీ అవసరాలు, దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు లేదా యుద్ధ సమయాల్లో విదేశీ ఉపగ్రహ సేవలపై ఆధారపడకుండా దేశీయంగా పూర్తి నియంత్రణ ఉండే వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా రిలయన్స్ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. అయితే ఉపగ్రహాల తయారీ కంటే, వాటన్నింటినీ కక్ష్యలోకి చేర్చేందుకు అవసరమైన రాకెట్ ప్రయోగ సామర్థ్యాన్ని సాధించడమే భారత్‌కు అతిపెద్ద సవాలుగా మారనుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.