బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు తన మేనల్లుడు హరీశ్ రావు నివాసానికి వెళ్లారు. హరీశ్ రావు తండ్రి దివంగత సత్యనారాయణరావు ప్రథమ వర్ధంతి (సంవత్సరీకం) సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.

రంగారెడ్డి జిల్లా నార్సింగి సర్కిల్ పరిధిలోని కోకాపేటలో ఉన్న హరీశ్ రావు స్వగృహానికి కేసీఆర్ చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం హరీశ్ రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. ఆయన దివంగత సత్యనారాయణరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి శ్రద్ధాంజలి అర్పించారు. వీరితో పాటు రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితర ముఖ్య నేతలు హాజరై హరీశ్ రావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
20261115frcb5814917056.jpg20261115frf5f0c53c9394.jpg20261115frab1ef42b945b.jpg