- ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఐదుగురు మావోయిస్టులను అరెస్ట్ చేసిన భద్రతా బలగాలు
- పట్టుబడిన వారిపై మొత్తం రూ. 20 లక్షల నగదు రివార్డు
- నిందితుల నుంచి ఒక ఏకే-47, ఎస్ఎల్ఆర్ స్వాధీనం
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో మావోయిస్టు నెట్‌వర్క్‌పై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపాయి. అటవీ ప్రాంతంలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో కీలక కమాండర్ సహా ఐదుగురు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. బస్తర్ రీజియన్‌లో శాంతిభద్రతల పరిరక్షణ దిశగా ఇది భద్రతా బలగాలకు లభించిన కీలక విజయంగా నిలిచింది.
అరెస్టయిన వారిలో మావోయిస్టు డివిజనల్ కమిటీ మెంబర్ చందర్ కత్లామ్తో పాటు ఇద్దరు ఏరియా కమాండర్లు, మరో ఇద్దరు పార్టీ సభ్యులు ఉన్నారని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. వీరిపై ప్రభుత్వం మొత్తం కలిపి రూ. 20 లక్షల రివార్డు ప్రకటించింది. బలగాల రాకను గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించిన వీరిని వ్యూహాత్మకంగా చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఒక ఏకే-47, ఎస్ఎల్ఆర్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
కాంకేర్ పరిధిలోని మేండ్రా, పార్తాపూర్ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న పక్కా నిఘా సమాచారంతో భద్రతా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. బలగాల వ్యూహాత్మక చర్యలతో కీలక నేతలతో కూడిన మావోయిస్టు బృందం చిక్కింది.
ప్రస్తుతం అరెస్టయిన మావోయిస్టులను గోండాహూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి అధికారులు లోతుగా విచారిస్తున్నారు. వీరి అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలను, విచారణలో వెల్లడయ్యే కీలక అంశాలను త్వరలోనే మీడియాకు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు. కీలక నేతలు పట్టుబడటంతో ఉత్తర బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల పట్టు మరింత బలహీనపడినట్లయింది.