- రాంచీ-పట్నా జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘటన
- రాజరప్ప ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం
- మృతులంతా బిహార్‌లోని నలందా జిల్లా వాసులు
ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామ్‌గఢ్ జిల్లాలో భక్తులతో వెళ్తున్న స్కార్పియో వాహనం ప్రమాదానికి గురైన ఘటనలో 13 మంది మరణించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రాంచీ-పట్నా జాతీయ రహదారి 33పై కుజు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. బిహార్‌లోని నలందా జిల్లా జంఘారో గ్రామానికి చెందిన 14 మంది భక్తులు స్కార్పియో వాహనంలో రాజరప్ప ఆలయానికి పూజల కోసం బయలుదేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే 13 మంది మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తిని రామ్‌గఢ్ సదర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతుల్లో ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.