- శ్రీధర్ వెంబుపై మాజీ భార్య ప్రమీల తీవ్ర ఆరోపణలు
- రహస్యంగా కుటుంబ సభ్యులకు జోహో షేర్లు బదిలీ చేశారని వెల్లడి
- కాలిఫోర్నియా కోర్టులో కొనసాగుతున్న ఆస్తుల పంపకాల వివాదం
- వచ్చే పరిహారాన్ని ఆటిజం పరిశోధనలకు కేటాయిస్తానన్న ప్రమీల
- ఆస్తుల దాచివేత ఆరోపణలను ఖండించిన శ్రీధర్ వెంబు
ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ జోహో (Zoho) సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు, ఆయన మాజీ భార్య ప్రమీలా శ్రీనివాసన్ మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తమ విడాకులు, జోహో సంస్థలోని షేర్ల రహస్య బదిలీకి సంబంధించి ప్రమీల తాజాగా ఫోర్బ్స్ ఇంటర్వ్యూలో పలు కీలక ఆరోపణలు చేశారు. తన ప్రమేయం లేకుండా, తనకు తెలియకుండానే శ్రీధర్ వెంబు కంపెనీ షేర్లను కుటుంబ సభ్యుల పేరిట మార్చారని ఆమె పేర్కొన్నారు.
ప్రమీల తెలిపిన వివరాల ప్రకారం.. 2019లో శ్రీధర్ వెంబు అమెరికా నుంచి భారత్‌లోని తమిళనాడుకు మారారు. వ్యాపార విస్తరణ కోసమే ఆయన భారత్ వెళ్లారని, తమ వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నట్లు తనకు అప్పట్లో ఎలాంటి అనుమానం రాలేదని ఆమె చెప్పారు. కాలిఫోర్నియాలో ఆటిజంతో బాధపడుతున్న కుమారుడితో కలిసి ఆమె అక్కడే ఉండిపోయారు. అయితే, అక్టోబర్ 2020లో శ్రీధర్ వెంబు వాట్సాప్ ద్వారా విడాకులు కావాలని మెసేజ్ పంపడంతో ఆమె దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ తర్వాత 2021లో విడాకుల పిటిషన్ దాఖలు కాగా, సెప్టెంబర్ 2023లో కాలిఫోర్నియా కోర్టు విడాకులు మంజూరు చేసింది.
అయితే, వీరిద్దరి మధ్య ఆస్తుల పంపకాల వివాదం ఇంకా పరిష్కారం కాలేదు. ప్రస్తుతం సుమారు 6.8 బిలియన్ డాలర్ల విలువైన జోహో సంస్థలో వెంబు కుటుంబానికి దాదాపు 6 బిలియన్ డాలర్ల విలువైన వాటా ఉంది. భారత ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. శ్రీధర్ వెంబు పేరిట కేవలం 5 శాతం వాటా మాత్రమే ఉండగా, ఆయన సోదరి రాధా వెంబుకు 47.8 శాతం, సోదరుడు శేఖర్‌కు 35.2 శాతం, సహ వ్యవస్థాపకుడు టోనీ థామస్‌కు 8 శాతం వాటాలు ఉన్నాయి.
విడాకుల సందేశం వచ్చిన కొన్ని నెలల తర్వాత టోనీ థామస్ సంతకాల కోసం పత్రాలు తెచ్చినప్పుడే కంపెనీ వాటాల వివరాలు తనకు తెలిశాయని ప్రమీల పేర్కొన్నారు. 2011లో తన అనుమతి లేకుండా, ఎలాంటి చెల్లింపులు జరగకుండానే శ్రీధర్ వెంబు తన షేర్లను కుటుంబ సభ్యులకు బదిలీ చేశారని ఆమె ఆరోపించారు. కాలిఫోర్నియా ఉమ్మడి ఆస్తి చట్టాల ప్రకారం (Community Property Rules), వివాహం తర్వాత సంపాదించిన ఆస్తులపై ఇద్దరికీ సమాన హక్కు ఉంటుందని, అందువల్ల ఈ బదిలీ చట్టవిరుద్ధమని ఆమె వాదిస్తున్నారు. రాధా పేరిట ఉన్న వాటాలు వాస్తవానికి శ్రీధర్ వెంబుకు చెందినవేనని ఆయన బంధువు ఒకరు కోర్టు సాక్ష్యంలో తెలిపిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.
మరోవైపు, వైవాహిక ఆస్తులను దాచడం కానీ, చట్టవిరుద్ధంగా షేర్లను బదిలీ చేయడం కానీ జరగలేదని శ్రీధర్ వెంబు గతంలోనే స్పష్టం చేశారు. ఈ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఈ న్యాయపోరాటం కోసం ఇప్పటికే దాదాపు 11 మిలియన్ డాలర్ల వరకు న్యాయవాద రుసుములు ఖర్చయ్యాయని, ఇందులో సగం వరకు శ్రీధర్ వెంబు చెల్లించారని సమాచారం. ఈ కేసులో భాగంగా 2025 ప్రారంభంలో శ్రీధర్ వెంబును 1.7 బిలియన్ డాలర్ల బాండ్‌ను సమర్పించాలని అమెరికా కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం చార్మ్ హెల్త్ (Charm Health) అనే హెల్త్‌కేర్ సాఫ్ట్వేర్ సంస్థను నడుపుతున్న ప్రమీల, ఈ వివాదం ద్వారా తనకు లభించే మొత్తాన్ని ఆటిజం పరిశోధనల కోసం తాను స్థాపించిన ‘ది బ్రెయిన్ ఫౌండేషన్’కు కేటాయిస్తానని స్పష్టం చేశారు. కాలిఫోర్నియా కోర్టులో ఈ ఆస్తుల పంపకాల కేసు విచారణ కొనసాగుతోంది.