- డిసెంబర్ 4 నుంచి 6 వరకు తిరుపతిలో ప్రధాని మోదీ పర్యటన
- అఖిల భారత డీజీపీలు, ఐజీపీల సదస్సులో పాల్గొననున్న ప్రధాని
- డిసెంబర్ 6న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించనున్నారు. తిరుపతి వేదికగా జరగనున్న 61వ అఖిల భారత డీజీపీలు, ఐజీపీల సదస్సులో పాల్గొనేందుకు ఆయన డిసెంబర్ 4 నుంచి 6వ తేదీ వరకు నగరంలో పర్యటిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కీలక సదస్సును తిరుపతి శివార్లలోని యెర్రపాడులో ఉన్న ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐసర్) ప్రాంగణంలో నిర్వహించనున్నారు.
పర్యటన వివరాల ప్రకారం.. డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం ప్రధాని మోదీ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ఆయనకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలుకుతారు. అనంతరం ఆయన నేరుగా 'ఐసర్' క్యాంపస్‌కు వెళ్లి అక్కడే బస చేస్తారు.
ఈ సదస్సులో ప్రధానితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ కూడా పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 200 మంది ఐపీఎస్ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరవుతారని అధికారులు ధ్రువీకరించారు.
డిసెంబర్ 5వ తేదీ పూర్తిస్థాయిలో, 6వ తేదీ మధ్యాహ్నం వరకు ప్రధాని ఈ సదస్సులో పాల్గొంటారు. దేశ అంతర్గత భద్రతకు ఎదురవుతున్న సవాళ్లు, సైబర్ క్రైమ్, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
పోలీసు వ్యవస్థలో కృత్రిమ మేధ (ఏఐ), ఆధునిక టెక్నాలజీ వినియోగంపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. సదస్సులో పాల్గొనే అధికారుల కోసం డిసెంబర్ 5, 6 తేదీల్లో ఉదయం యోగా సెషన్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
తన పర్యటనలో భాగంగా డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం ప్రధాని మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శనం అనంతరం ఆయన ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు తిరుపతిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
రవాణా, వసతి, విద్యుత్, పారిశుద్ధ్య ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఢిల్లీ వెలుపల ఇంతటి ఉన్నత స్థాయి సదస్సు జరుగుతుండటంతో అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.