- భార్యాబిడ్డలను కలిసేందుకు నీలం నది దాటుతూ బారాముల్లా వాసి ఇర్ఫాన్ మృతి
- నియంత్రణ రేఖ వద్ద కేరన్ సమీపంలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు
- 2025 పహల్గామ్ దాడి తర్వాత భారత్ నుంచి బహిష్కరణకు గురైన ఇర్ఫాన్ కుటుంబం
- మృతదేహాన్ని ముజఫరాబాద్‌లోని భార్యాపిల్లలకు అప్పగించిన పాక్ అధికారులు
సరిహద్దులు విడదీసిన తన కుటుంబాన్ని కలుసుకోవాలన్న తపనతో ఓ వ్యక్తి చేసిన సాహసం విషాదంగా ముగిసింది. నియంత్రణ రేఖ వెంబడి ప్రవహించే నదిని దాటే ప్రయత్నంలో బారాముల్లాకు చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన కశ్మీర్‌లో చోటుచేసుకుంది.
జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాకు చెందిన ఇర్ఫాన్ హసన్ షా (54) మృతదేహాన్ని నవంబర్ 23న పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కేరన్ సమీపంలో అధికారులు గుర్తించారు. భారత్‌లో కిషన్‌గంగగా పిలిచే నీలం నదిని దాటుతూ ఆయన మునిగిపోయినట్లు వెల్లడించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో నివసిస్తున్న తన భార్య, ముగ్గురు కుమారులను కలిసేందుకే ఇర్ఫాన్ ఈ ప్రమాదకర ప్రయత్నం చేసినట్లు తెలిసింది.
2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ దాడి అనంతరం, పాకిస్థాన్ జాతీయులైన ఇర్ఫాన్ భార్య, పిల్లలను భారత అధికారులు తమ దేశానికి తిప్పి పంపారు. భారత పౌరుడైన ఇర్ఫాన్ మాత్రం బారాముల్లాలోనే ఉండిపోయారు. అప్పటి నుంచి కుటుంబానికి దూరమైన ఆయన, ఎలాగైనా వారిని కలుసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించినట్లు బంధువులు తెలిపారు.
నదిలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో, పాక్ అధికారులు, సైన్యం అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. అతని వద్ద లభించిన భారత గుర్తింపు కార్డు ఆధారంగా ఇర్ఫాన్‌గా గుర్తించారు. అనంతరం, ఇరు దేశాల్లోని బంధువులతో సంప్రదించి, అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని ముజఫరాబాద్‌లోని అతని భార్యాపిల్లలకు అప్పగించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని పాక్‌లోని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.