- రాయలసీమ గురించి మాట్లాడే కనీస అర్హత జగన్‌కు లేదన్న బీటెక్ రవి
- హరీశ్ రావు హెచ్చరికలకు లొంగి రాయలసీమ లిఫ్ట్‌ను జగన్ వదిలేశారని ఆరోపణ
- రాయలసీమ లిఫ్ట్ పేరుతో రూ.1000 కోట్ల మట్టి పనుల దోపిడీ జరిగిందని విమర్శ
- గత ఐదేళ్ల పాలనలో జీవో 365 తెచ్చి 102 ప్రాజెక్టుల పనులు రద్దు చేసిన వైనం
- కూటమి ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలోనే ప్రాజెక్టులకు రూ.13,500 కోట్ల వ్యయం
రాయలసీమ ప్రాజెక్టులు, రైతుల సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ పులివెందుల ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాయలసీమకు తీరని ద్రోహం చేసిన జగన్, ఇప్పుడు నీచ రాజకీయాల కోసమే సీమ పేరును వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ఘాటైన ప్రకటన విడుదల చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీనీవా పనులను వేగవంతం చేసి, రాయలసీమ చిట్టచివరి ఆయకట్టు వరకు కృష్ణా జలాలను పారిస్తుంటే పొరుగు రాష్ట్రాల నేతలు సైతం ప్రశంసిస్తున్నారని, ఇది చూసి ఓర్వలేక జగన్ కడుపుమంటతో రగిలిపోతున్నారని ఎద్దేవా చేశారు. 2020లోనే హెచ్చరించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు బహిరంగంగానే చెప్పారని, దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. శ్రీశైలంలో 798 అడుగుల వద్దే నీటిని తరలించేలా ముచ్చుమర్రి ప్రాజెక్టును చంద్రబాబు నిర్మిస్తే, తన పాలనలో దాన్ని జగన్ పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో రూ.1,000 కోట్ల మేర కేవలం మట్టి పనులు చేసి ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. అనుమతులు లేకపోవడంతో 2020లోనే ఈ ప్రాజెక్టును ఎన్జీటీ నిలిపివేసిందని గుర్తుచేశారు. వైసీపీ ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 39 మంది ప్రాణాలు కోల్పోయారని, హంద్రీనీవా విద్యుత్ బిల్లులు కూడా కట్టలేని దుస్థితిలో గత పాలన సాగిందని ధ్వజమెత్తారు. ఐదేళ్లలో కనీసం రూ.2 వేల కోట్లు కూడా సీమ ప్రాజెక్టులపై వెచ్చించలేదని, పైగా జీవో 365 ద్వారా 102 సాగునీటి పనులను రద్దు చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలోనే రూ.13,500 కోట్లు ఖర్చు చేసిందని, మరో రూ.10 వేల కోట్లు వెచ్చించి కుప్పం సహా అన్ని ప్రాంతాలకు కృష్ణా జలాలను తరలిస్తున్నామని బీటెక్ రవి స్పష్టం చేశారు.