- ఏపీ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల జోరు
- రాష్ట్రవ్యాప్తంగా 74.67 శాతం మేర భారీగా నమోదైన పోలింగ్
- అత్యధికంగా ఏలూరులో 84.83 శాతం, విజయనగరంలో 83.33 శాతం నమోదు
- అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి సహా పలు జిల్లాల్లో టీడీపీ అభ్యర్థుల హవా
- కనగానపల్లి మండలం నరసంపల్లెలో బ్యాలెట్ బాక్స్‌లో సిరా పోయడంతో రీపోలింగ్
ఏపీలో గురువారం జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ప్రభంజనం సృష్టిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని పల్లెల్లో టీడీపీ జెండా రెపరెపలాడుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు ఉత్సాహంగా సాగగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి చేపట్టిన ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ల నుంచే కూటమి మద్దతుదారులు స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. సాయంత్రం వేళకు అందిన అనధికారిక ఫలితాల ప్రకారం మెజారిటీ స్థానాల్లో టీడీపీ మద్దతుదారులే సర్పంచ్ పీఠాలను కైవసం చేసుకుంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 74.67 శాతం మేర భారీ పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఏలూరు జిల్లాలో 84.83 శాతం, విజయనగరంలో 83.33 శాతం, చిత్తూరులో 83.29 శాతం మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీడీపీ మద్దతుదారులు విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి జిల్లాల్లో ఏకపక్ష ఫలితాలు వెలువడగా.. అన్నమయ్య జిల్లాలో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు రికార్డు స్థాయిలో గెలుపొందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం బియ్యపు తిప్పలో రీకౌంటింగ్ తర్వాత కూటమి అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించడం ఆసక్తి రేపింది.
పోలింగ్ కేంద్రాల వద్ద కొన్నిచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం నరసంపల్లెలో బ్యాలెట్ బాక్స్‌లో సిరా పోసిన ఘటనలో కలెక్టర్ రీపోలింగ్‌కు ఆదేశించారు. అన్నమయ్య జిల్లా శెట్టిపల్లిలో కొందరు నిరసనకారులు పోలీసు వాహనంపైకి ఎక్కి ఆందోళన చేపట్టగా, కర్నూలు జిల్లా మండగిరిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. రాత్రి పొద్దుపోయే వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.