- ట్రాయ్ నుంచి '1601' నంబర్ సిరీస్ విస్తరణ ఉత్తర్వులు
- ప్రమోషనల్ కాల్స్‌పై పూర్తి స్థాయి నిషేధం
- రూ. 500 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న సంస్థలకే అవకాశం
- సేవలు, లావాదేవీల సమాచారం కోసం మాత్రమే నంబర్ల కేటాయింపు
- 180 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆపరేటర్లకు ఆదేశం
టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) వినియోగదారుల భద్రత, మోసపూరిత కాల్స్ నియంత్రణే లక్ష్యంగా మరో కీలక ముందడుగు వేసింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు (BFSI), ప్రభుత్వ రంగాలు కాకుండా ఇతర విభాగాల్లోని అర్హత కలిగిన సంస్థలకు సైతం '1601' సిరీస్ నంబర్లను విస్తరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తమ కస్టమర్లకు కేవలం సర్వీస్, ట్రాన్సాక్షనల్ వాయిస్ కాల్స్ చేయడానికి మాత్రమే ఈ నంబర్లను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది.
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) కేటాయించే ఈ సిరీస్‌ను రెండో దశ కింద అమలు చేస్తున్నారు. నిర్దేశిత అర్హతలు ఉన్న కంపెనీలకు మాత్రమే ఈ నంబర్లను కేటాయిస్తామని కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా మార్గదర్శకాల ప్రకారం రిటైల్ చైన్లు, ఈ-కామర్స్ సంస్థలు, ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISPs) ఈ నంబర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితో పాటు ఆటోమొబైల్ విక్రయాలు, రిపేర్-సర్వీసింగ్ సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు, కమర్షియల్ ఎయిర్‌లైన్స్, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు, క్యాబ్ అగ్రిగేటర్లు, లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్లు (LSPs) కూడా ఈ సిరీస్ పొందేందుకు అర్హులని పేర్కొంది.
ఈ నంబర్ల కేటాయింపునకు సంబంధించి కొన్ని కఠిన నిబంధనలను విధించారు. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో కనీసం ఒక ఏడాదిలోనైనా రూ. 500 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ సాధించిన సంస్థలకు మాత్రమే 1601 సిరీస్ నంబర్లు లభిస్తాయి.
అలాగే డీటీహెచ్, హెడ్ఎండ్-ఇన్-ది-స్కై (HITS), ఐపీటీవీ, ఎంఎస్ఓ (మల్టీ-సిస్టమ్ ఆపరేటర్స్) వంటి డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్ ఆపరేటర్లకు గత 12 నెలల్లో ఏదైనా ఒక నెలలో కనీసం 10 లక్షల మంది (1 మిలియన్) సబ్స్క్రైబర్లు ఉండాలని స్పష్టం చేశారు. భారతీయ చట్టాల ప్రకారం ఇక్కడ నమోదైన కంపెనీలకు మాత్రమే ఈ సిరీస్ వర్తిస్తుంది.
గతంలో మొదటి దశ కింద యుటిలిటీస్, లాజిస్టిక్స్, కొరియర్ సర్వీస్ రంగాలకు ఈ 1601 సిరీస్‌ను అనుమతించారు. ఈ నంబర్ల ద్వారా ప్రమోషనల్ లేదా వాణిజ్య ప్రకటనల కాల్స్ చేయడానికి అనుమతి లేదు. సాధారణంగా సైబర్ మోసగాళ్లు సాధారణ 10 అంకెల మొబైల్ నంబర్లను ఉపయోగించి ప్రముఖ కంపెనీల పేరిట వినియోగదారులను మోసం చేస్తుంటారు. ఈ నంబర్ సిరీస్‌ను కేవలం ధ్రువీకరించిన సంస్థలకే ఇవ్వడం వల్ల వ్యాపారాల పేరుతో వచ్చే మోసాలను నివారించవచ్చని, వినియోగదారులు కూడా నిజమైన కాల్స్‌ను సులభంగా గుర్తించవచ్చని మంత్రిత్వ శాఖ వివరించింది. అర్హత ఉన్న సంస్థలన్నింటినీ 180 రోజుల్లోగా ఈ సిరీస్‌కు అనుసంధానించాలని (ఆన్‌బోర్డింగ్, మైగ్రేషన్ పూర్తి చేయాలని) యాక్సెస్ ప్రొవైడర్లను ట్రాయ్ ఆదేశించింది.