- శ్రీవారికి 121 కిలోల ఆభరణాలు సమర్పించిన జైన్ దంపతులు
- తిరుమల వేదికగా జైన్ దంపతుల అపూర్వ దాతృత్వాన్ని కొనియాడిన సీఎం
- శ్రీకృష్ణదేవరాయల నాటి భక్తి సంప్రదాయాన్ని నేటి తరానికి గుర్తుచేసిన వైనం
- టీటీడీ ఆధ్వర్యంలో 5 వేల నూతన ఆలయాల నిర్మాణానికి ప్రణాళికలు
- దేశ రాజధానులు, విదేశాల్లోనూ శ్రీవారి ఆలయాల ఏర్పాటుకు సన్నాహాలు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి చెన్నైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వర్ధమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు సమర్పించిన రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు, వజ్రాభరణాల విరాళం భక్తి పరంపరలో ఓ సువర్ణాధ్యాయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కొనియాడారు. సతీసమేతంగా ఈ సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంపాదించిన సంపదను సమాజ సేవకు, భగవత్ కైంకర్యానికి వినియోగించడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని, జైన్ దంపతుల దాతృత్వం అందరికీ ఆదర్శప్రాయమని ప్రశంసించారు.
విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల నాటి నుంచి నేటి జైన్ దంపతుల దాకా స్వామివారిపై భక్తివిశ్వాసాలు అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నాయని సీఎం గుర్తుచేశారు. నిత్యం మూలవిరాట్టుకు అలంకరించే 120 కిలోల ఆభరణాలకు అదనంగా, దైవ సంకల్పంతోనే 121 కిలోల ఆభరణాలు సమర్పించినట్లు దాతలు చెప్పడం వారి నిస్వార్థ భక్తికి నిదర్శనమన్నారు. ఇతర ధనవంతులు కూడా ముందుకొచ్చి పేదల సంక్షేమానికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో టీటీడీ సహకారంతో 5 వేల ఆలయాలు నిర్మించడంతో పాటు, దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో, విదేశాల్లో హిందువులు అధికంగా ఉండే ప్రాంతాల్లో శ్రీవారి దేవాలయాలను, అన్నప్రసాద కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. తిరుమలకు నీటి కొరత లేకుండా హంద్రీ-నీవా ద్వారా కల్యాణి డ్యామ్‌కు, సోమశిల ద్వారా బాలాజీ రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తామని, అవసరమైతే రెండో పైప్‌లైన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలిపిరి దాడి సమయంలో శ్రీవారే తనకు ప్రాణభిక్ష పెట్టి పునర్జన్మ ప్రసాదించారని ఈ సందర్భంగా సీఎం భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు.