- ఓటర్ పోర్టల్‌లో సెక్యూరిటీ లోపాన్ని సరిచేసిన కేంద్ర ఎన్నికల సంఘం
- రాయిటర్స్ సమాచారంతో రంగంలోకి దిగిన ఈసీ ఐటీ విభాగం
- ఓటర్ల వ్యక్తిగత వివరాలు పత్రాల డేటా బహిర్గతం కాకుండా చర్యలు
- ఎన్నికల వేళ ఓటర్ డేటా భద్రతపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆందోళన
- పోర్టల్‌లో సమస్య అనుకోకుండా జరిగి ఉండొచ్చన్న మాజీ ఈసీ అశోక్ లవాసా
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తన అధికారిక ఓటర్ పోర్టల్‌లో తలెత్తిన సాంకేతిక భద్రతా లోపాన్ని గుర్తించి సరిదిద్దింది. ఓటర్ల వ్యక్తిగత వివరాలతో పాటు వారు అప్లోడ్ చేసిన గుర్తింపు పత్రాల వివరాలు బహిర్గతమయ్యే ప్రమాదం ఉందని గుర్తించిన వెంటనే కమిషన్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావడంతో వెంటనే సమస్యను పరిష్కరించారు.
రాయిటర్స్ కథనం ప్రకారం.. 2025 జూన్‌లో ఎన్నికల సంఘం ఓటర్ పోర్టల్‌లో ‘కాల్-బుకింగ్’ అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పోర్టల్‌లోకి లాగిన్ అయిన ఓటర్లు సంబంధిత ఎన్నికల అధికారి నుంచి కాల్‌బ్యాక్ కోరేందుకు ఈ సదుపాయం కల్పించారు. అయితే, బ్రౌజర్లోని డెవలపర్ టూల్స్ నెట్వర్క్ ట్యాబ్‌ను పరిశీలించినప్పుడు తెరవెనుక ఉన్న అత్యంత కీలకమైన డేటా బయటపడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఓటర్ రిజిస్ట్రేషన్ లేదా వివరాల మార్పు కోసం సమర్పించిన ఫారాల రిఫరెన్స్ నంబర్లతో పాటు, సాధారణ వెబ్‌పేజీలో కనిపించని ఓటర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు, పుట్టిన తేదీలు, చిరునామాలు, వారు అప్లోడ్ చేసిన పాస్‌పోర్ట్ తదితర గుర్తింపు పత్రాల ఫైల్ పాత్‌లు కూడా కనిపిస్తున్నట్లు బయటపడింది.
ఈ భద్రతా లోపాన్ని సైబర్ పరిశోధకులు కరణ్ సైనీ, ఎహ్రాజ్ అహ్మద్ క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించారు. సర్వర్ కేవలం వినియోగదారుడి లాగిన్ స్థితిని మాత్రమే తనిఖీ చేస్తోందని, రికార్డులను చూసే ప్రాప్యత హక్కులను (యాక్సెస్ రైట్స్) సరిగ్గా ధ్రువీకరించడం లేదని వారు స్పష్టం చేశారు. రిఫరెన్స్ నంబర్లు సులభంగా ఊహించే క్రమంలో ఉండటం వల్ల పెద్ద ఎత్తున ఓటర్ల సమాచారాన్ని స్వయంచాలకంగా సేకరించే ముప్పు ఉందని హెచ్చరించారు. పరీక్షల సమయంలో ఒక రాయిటర్స్ ప్రతినిధి సైతం తన సొంత గుర్తింపు పత్రాన్ని సులభంగా డౌన్లోడ్ చేసుకోగలిగారు.
నెల రోజుల పాటు నిర్వహించిన పరిశోధన అనంతరం, 2026 అక్టోబర్ 26న రాయిటర్స్ ఈ విషయాన్ని మొదటగా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందన కోరుతూ పలుమార్లు సంప్రదించగా, నవంబర్ 26న ఈసీ ప్రతినిధి స్పందిస్తూ.. సమస్యను పరిష్కరించేందుకు ఐటీ విభాగాన్ని ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం కొద్ది గంటల్లోనే సున్నితమైన వ్యక్తిగత వివరాలు, డాక్యుమెంట్ ఫైల్ పాత్‌లు పోర్టల్‌లో కనిపించకుండా ఎన్నికల సంఘం చర్యలు పూర్తి చేసింది. ఈ మార్పులను రాయిటర్స్‌తో పాటు భద్రతా పరిశోధకులు కూడా ధ్రువీకరించారు.
అయితే, ఈ లోపం ఎంతకాలంగా కొనసాగుతోంది? ఎంతమంది ఓటర్ల వివరాలు బహిర్గతమయ్యాయి? ఎవరైనా దుర్వినియోగం చేశారా? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఓటర్ల జాబితాల సవరణపై రాజకీయ చర్చ సాగుతున్న సమయంలో ఈ వ్యవహారం వెలుగుచూడటం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఈ అంశంపై స్పందిస్తూ.. ఇది తీవ్ర ఆందోళనకరమని, ఓటర్ల ప్రొఫైలింగ్ లేదా వారిని ప్రభావితం చేసే ప్రమాదముందని పేర్కొన్నారు. మరోవైపు, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా రాయిటర్స్‌తో మాట్లాడుతూ, పోర్టల్‌లో డేటా కనిపించడం అనుకోకుండా జరిగిన పొరపాటుగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.