- రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జగన్ చేసిన వ్యాఖ్యలకు కాల్వ శ్రీనివాసులు కౌంటర్
- జగన్ కు వార్నింగ్ గురించి గతంలో హరీశ్ రావు చెప్పారన్న టీడీపీ ఎమ్మెల్యే
- ప్రాజెక్టుపై స్టే వచ్చినా అప్పీల్ చేయకుండా జగన్ తాత్సారం చేశారని విమర్శ
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేసిన పోస్టుకు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కౌంటర్ ఇచ్చారు. రాయలసీమ అభివృద్ధిని, ఇక్కడి ప్రాజెక్టులను అడ్డుకుంది ముమ్మాటికీ జగనేనంటూ ఆయన మండిపడ్డారు. అనంతపురంలో కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
జగన్ హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిచిపోయాయని కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. తన రాజకీయ పెద్దన్నగా భావించిన కేసీఆర్ వార్నింగ్ ఇవ్వడంతోనే జగన్ ఈ ప్రాజెక్టు పనులను నిలిపివేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని తాము స్వయంగా చెప్పడం లేదని, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్వయంగా వెల్లడించారని తెలిపారు. అంతేకాకుండా, ఈ పథకంపై కోర్టు స్టే వచ్చిన తర్వాత జగన్ దాదాపు మూడేళ్లన్నర పాటు అధికారంలో ఉన్నప్పటికీ, ఎందుకు కనీసం అప్పీల్ కూడా చేయలేదని కాల్వ నిలదీశారు.
అంతకుముందు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జగన్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ఇది కొత్త ప్రాజెక్టు కాదని, శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగుల కంటే తగ్గినప్పుడు సీమకు కేటాయించిన నీటిని సమర్థంగా వాడుకునే ఒక ఇన్సూరెన్స్ లాంటి పథకమని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కారణాలతో ప్రాజెక్టును నిలిపివేసిందని జగన్ ఆరోపించగా, అసలు ప్రాజెక్టును ఆపేసి రాయలసీమకు ద్రోహం చేసింది జగనేనని కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు.