- టీడీపీలో చేరిన కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరులు
- కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి
- అభివృద్ధిని చూసే టీడీపీలో చేరుతున్నారన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నెల్లూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పొదలకూరు మండలంలో వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్వగ్రామమైన పొదలకూరుకు చెందిన ఆయన ముఖ్య అనుచరులు ఊకోటి లక్ష్మీనారాయణ, సన్నికంటి శ్రీనివాసులతో పాటు సుమారు 150 కుటుంబాలు గురువారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి.
సర్వేపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో వీరు టీడీపీలో చేరారు. వీరందరికీ సోమిరెడ్డి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు టీడీపీ పట్ల ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు మద్దతుగా నాయకులు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని ఆయన వివరించారు.
రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ, మలి దశ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఈ చేరికలు జరిగడం చర్చనీయాంశంగా మారింది.