- ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి పయనం
- ఢిల్లీలో జరగనున్న ఎన్డీయే సమావేశానికి హాజరుకానున్న చంద్రబాబు
- పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో మోదీ ఆహ్వానం మేరకు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో స్వల్ప ఆటంకం ఎదురైంది. ఆయన ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. అక్కడి నుంచి ఆయన మరో విమానంలో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకోనున్నారు.
కాగా, ఢిల్లీ నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు కూడా పిలుపు అందినట్టు తెలుస్తోంది. నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఎన్డీయే కూటమి నేతల కీలక సమావేశం ఈ సాయంత్రం ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి పలు కీలక జాతీయ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఢిల్లీ చేరుకున్న తర్వాత రాత్రి 7 గంటల అనంతరం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో తన పర్యటన వివరాలు, ఎన్డీయే సమావేశ చర్చాంశాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక విషయాలను ఆయన మీడియాతో పంచుకోనున్నారు. ప్రయాణంలో స్వల్ప జాప్యం జరిగినప్పటికీ, ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలన్నీ యథావిధిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.