- చెన్నై వేదికగా ఘనంగా డీఎండీకే నేత సుధీష్ కుమార్తె రిసెప్షన్
- ఆర్కే కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా వేడుక
- డాక్టర్ జన్ను శ్రీ-అఖిల్ రవి కుమార్ దంపతులకు లోకేశ్ శుభాకాంక్షలు
- చెన్నైలో అనిరుధ్, కావ్య మారన్ రిసెప్షన్కూ హాజరైన మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ చెన్నైలో జరిగిన పలు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు, డీఎండీకే పార్టీ కోశాధికారి ఎల్.కే. సుధీష్ కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
చెన్నైలోని ఆర్కే కన్వెన్షన్ సెంటర్‌లో ఈ రిసెప్షన్ ఘనంగా జరిగింది. డీఎండీకే ముఖ్య నేత ఎల్.కే. సుధీష్, ఎల్‌కేఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణ జ్యోతి సుధీష్ దంపతుల కుమార్తె డాక్టర్ జన్ను శ్రీ సుధీష్, అఖిల్ రవి కుమార్‌ల వివాహ రిసెప్షన్‌కు హాజరైన మంత్రి లోకేశ్, నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు. అంతకుముందు, సుధీష్ కుటుంబ సభ్యులు లోకేశ్‌కు సాదర స్వాగతం పలికారు.
అలాగే తన చెన్నై పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ మరో కీలక వేడుకలోనూ భాగమయ్యారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సహ యజమాని కావ్య మారన్‌ల వివాహ రిసెప్షన్‌కు కూడా ఆయన హాజరయ్యారు. నూతన దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపి, కాసేపు కుటుంబ సభ్యులతో ముచ్చటించారు.