- చెన్నైలో అట్టహాసంగా సాగిన అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ రిసెప్షన్
- హాజరైన తమిళనాడు సీఎం విజయ్, రజనీకాంత్, కమల్ హాసన్
- నవదంపతులను ఆశీర్వదించిన డీఎంకే, అన్నాడీఎంకే అగ్రనేతలు
- సందడి చేసిన కేన్ విలియమ్సన్, భువనేశ్వర్ కుమార్, మురళీధరన్
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ వివాహ రిసెప్షన్ చెన్నైలో శనివారం (నవంబరు 21) రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల కలయికతో ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నవంబర్ 11న గ్రీస్ దేశంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి జరిగిన పది రోజుల తర్వాత, బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల కోసం చెన్నైలో ఈ భారీ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు తమిళనాడుతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు.
రాజకీయ రంగం నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేశ్ తదితరులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ద్రావిడర్ కళగం అధ్యక్షుడు కె. వీరమణి, డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్, ఎంపీలు కనిమొళి, ఎ. రాజా, మాజీ మంత్రులు కె.ఎన్. నెహ్రూ, ఎం.ఆర్.కె. పన్నీర్‌సెల్వం, తంగం తెన్నరసు, సీపీఎం నేత కె. బాలకృష్ణన్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
సినిమా రంగానికి సంబంధించి సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు సౌందర్య రజనీకాంత్, సీనియర్ నటులు ప్రభు, రాధికా శరత్‌కుమార్, ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను, దర్శకుడు ధరణి తదితరులు హాజరై అనిరుధ్-కావ్య జంటను అభినందించారు. గ్రీస్‌లో జరిగిన వివాహానికి హాజరైన రజినీకాంత్, స్టాలిన్.. మరోసారి చెన్నై రిసెప్షన్‌కు వచ్చి మారన్ కుటుంబంతో తమకున్న సాన్నిహిత్యాన్ని చాటుకున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీతో కావ్య మారన్‌కు ఉన్న అనుబంధం కారణంగా క్రికెట్ ప్రముఖులు కూడా ఈ విందులో సందడి చేశారు. భారత పేసర్ భువనేశ్వర్ కుమార్, న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్, శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.