- కుప్పం, పలాస ఎయిర్‌పోర్టులకు భూసేకరణ జరుగుతోందన్న రామ్మోహన్ నాయుడు
- భోగాపురంపై కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని వెల్లడి
- సీఐఐ సమ్మిట్‌తో ఏపీ బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తం చేశామన్న కేంద్ర మంత్రి
కొత్తగా వచ్చే విమానయాన సంస్థలకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన స్థావరంగా (బేస్) మారాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. దేశవ్యాప్తంగా విమానయాన రంగాన్ని విస్తరించే క్రమంలో మరిన్ని కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రం వద్ద పరిశీలనలో ఉన్నాయని ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్‌పోర్టుల నెట్వర్క్ విస్తరణపై మాట్లాడిన కేంద్రమంత్రి... కుప్పం, పలాస ప్రాంతాల్లో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే ఆయా ప్రాంతాల ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సదస్సుల గురించి ప్రస్తావిస్తూ... వైజాగ్‌కు సీఐఐ సమ్మిట్లు కొత్తేమీ కాదని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇప్పుడే కాకుండా, గతంలోనూ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఐఐ సమ్మిట్‌తో పాటు అనేక అంతర్జాతీయ సదస్సులను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించారని గుర్తుచేశారు. ఆ సదస్సుల ద్వారానే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలిగామని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల విశాఖలో నిర్వహించిన సీఐఐ సదస్సు దేశంలోనే ఇంతకుముందెన్నడూ జరగని రీతిలో అత్యంత ఘనంగా జరిగిందని, ఇది రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎంతగానో దోహదపడుతుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.