- హఠాత్తుగా అస్వస్థతకు గురైన ఏపీఎస్సార్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు
- కళ్లు తిరగడంతో వెంటనే ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
- మెదడులో క్లాట్ ఉన్నట్లు గుర్తించడంతో విజయవాడకు తరలింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణరావు ఈ ఉదయం హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఉదయం ఆయనకు తీవ్రంగా కళ్లు తిరగడంతో కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఆయన బ్రెయిన్లో రక్తపు గడ్డ (క్లాట్) ఉన్నట్లు గుర్తించారని సమాచారం. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను హుటాహుటిన విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందుతోంది.
కొనకళ్ల నారాయణరావు అస్వస్థతకు గురైన విషయం తెలియగానే రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. ఆస్పత్రికి చేరుకున్న ఆయన... కొనకళ్ల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే అక్కడే ఉన్న కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయనకు అత్యుత్తమ వైద్యం అందించాలని వైద్య బృందానికి సూచించారు.
అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ... కొనకళ్ల నారాయణరావు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. కొనకళ్ల అస్వస్థతకు గురయ్యారన్న వార్త తెలియడంతో పలువురు కూటమి నేతలు, పార్టీ కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.