- షర్మిల కుమార్తె పెళ్లికి తనను ఆహ్వానించడంపై కథనాలు
- సాక్షి పత్రికపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజం
- వైసీపీది విధ్వంసకర చరిత్ర అని విమర్శ
సాక్షి పత్రిక బాధ్యతారహితంగా వార్తలు రాస్తోందని, వైసీపీ తీరు రాష్ట్రానికి హాని చేసేలా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా విధ్వంసమే ఆ పార్టీ చరిత్ర అని, అందుకే దానిని "గొడ్డలి పార్టీ" అని పిలవాల్సి వస్తోందని ఆయన విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ షర్మిల కుమార్తె వివాహానికి తనను ఆహ్వానించడంపై సాక్షి పత్రికలో వచ్చిన కథనాల పట్ల చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇంటికి వచ్చి పెళ్లికి పిలిస్తే సొంత చెల్లిపైనే అసభ్యంగా రాస్తారా? షర్మిల తన కుమార్తె పెళ్లికి నన్ను పిలిచారు. దీనిపై ఇంత నీచపు రాతలు అవసరమా? రాజకీయాలు, వ్యక్తిగత సంబంధాలు వేరనే కనీస అవగాహన కూడా లేదా?" అని ఆయన ప్రశ్నించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకున్న స్నేహాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. "రాజశేఖరరెడ్డి, నేను మంచి స్నేహితులం. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ మా వ్యక్తిగత సంబంధాలు ఎన్నడూ చెడిపోలేదు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు షర్మిల, జగన్ ఇద్దరి పెళ్లిళ్లకూ నన్ను పిలిచారు, నేను హాజరయ్యాను. సంబంధాలను ఇంత దారుణంగా కించపరుస్తారా?" అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి పెట్టుబడులు రావడం చూసి వైసీపీ ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించడమే ఆ పార్టీ పనిగా పెట్టుకుందని విమర్శించారు.