- న్యూజిలాండ్‌తో టెస్టులో భారత బ్యాటర్ల అరుదైన రికార్డు
- విదేశీ గడ్డపై తొలిసారి టాప్-5 బ్యాటర్లందరి నుంచీ 50కి పైగా రన్స్
- సెంచరీతో మెరిసిన కేఎల్ రాహుల్, 98 పరుగుల వద్ద ఔటైన కెప్టెన్ గిల్
- రాహుల్, జైస్వాల్, పడిక్కల్, గిల్, పంత్ అందరూ హాఫ్ సెంచరీ మార్క్ దాటిన వైనం
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా వెల్లింగ్‌టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో టీమిండియా బ్యాటర్లు పరుగుల వరద పారించారు. తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో భారత టాప్-5 బ్యాటర్లు అందరూ 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసి చరిత్ర సృష్టించారు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇది ఐదోసారి కాగా, విదేశీ గడ్డపై ఇలాంటి ఘనత సాధించడం మాత్రం ఇదే తొలిసారి కావడం విశేషం. 94 ఏళ్ల భారత టెస్ట్ చరిత్రలో ఏ పర్యటనలోనూ ఈ ఫీట్ నమోదు కాలేదు.
తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ను 368 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్, మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 486 పరుగుల భారీ స్కోరుతో పటిష్ఠ స్థితిలో నిలిచింది.
ఈ ఇన్నింగ్స్‌లో భారత బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా రాణించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (85), కేఎల్ రాహుల్ (136) తొలి వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్ (80) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (98) తృటిలో సెంచరీ చేజార్చుకుని నిరాశగా వెనుదిరిగాడు. చివర్లో రిషభ్ పంత్ కూడా దూకుడుగా ఆడి 62 బంతుల్లో 55 పరుగులతో అజేయంగా నిలిచాడు.
కేఎల్ రాహుల్ రికార్డుల మోత
ఈ మ్యాచ్‌లో అద్భుత శతకంతో మెరిసిన కేఎల్ రాహుల్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్ గడ్డపై తన తొలి టెస్ట్ ఇన్నింగ్స్‌లోనే సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో 1976లో సునీల్ గవాస్కర్ (116), సురీందర్ అమర్‌నాథ్ (124) ఈ ఘనత సాధించారు.
అంతేకాకుండా, అన్ని సేనా (SENA - సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లోనూ టెస్ట్ సెంచరీ చేసిన ఐదో భారత క్రికెటర్‌గా రాహుల్ నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో రాహుల్.. జైస్వాల్‌తో కలిసి 130 పరుగులు, పడిక్కల్‌తో కలిసి 165 పరుగుల కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ ప్రదర్శనతో టీమిండియా ప్రస్తుతం 118 పరుగుల ఆధిక్యంతో మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది.