- కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఉత్పత్తి ప్రారంభించిన రిలయన్స్ ప్లాంట్
- కేవలం 12 నెలల్లోనే సిద్ధమైన ఆసియాలోనే అతిపెద్ద బెవరేజ్ యూనిట్
- స్థానిక యువతకు లభించనున్న 1,200 ప్రత్యక్ష ఉద్యోగాలు
- కూటమి ప్రభుత్వ 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'కు ఓర్వకల్లే ప్రత్యక్ష నిదర్శనమన్న లోకేశ్
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద పానీయాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి రికార్డు సృష్టించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సరిగ్గా ఏడాది క్రితం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగ్గా, కేవలం 12 నెలల వ్యవధిలోనే పనులు పూర్తి చేసుకుని ఉత్పత్తిని ప్రారంభించడం విశేషం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ప్లాంట్‌లో కాంపా కోలాతో పాటు పండ్ల రసాలు, ప్యాకేజ్డ్ తాగునీటి తయారీ మొదలైంది. ప్రభుత్వం నినదిస్తున్న ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు ఓర్వకల్లు ప్లాంట్ ఒక ప్రత్యక్ష నిదర్శనమని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌పై పూర్తి నమ్మకంతో రాష్ట్రంలో ఇంతటి భారీ పరిశ్రమను ఏర్పాటు చేసిన రిలయన్స్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, వేగవంతమైన నిర్ణయాలపై విశ్వాసం ఉంచి పెట్టుబడులు పెట్టినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు.
తరతరాల భారతీయుల జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న స్వదేశీ బ్రాండ్ కాంపా కోలా, ఇప్పుడు రాయలసీమ గడ్డపై సరికొత్త రూపంలో పునర్జన్మ పొందిందని లోకేశ్ వివరించారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో పోటీపడే సత్తా ఉన్న స్వదేశీ బ్రాండ్లకు ఆంధ్రప్రదేశ్ వేదిక కావడం రాష్ట్రానికే గర్వకారణమని చెప్పారు. ఓర్వకల్లులో తయారయ్యే ఉత్పత్తులు దేశంలోని ప్రతి ఇంటికీ చేరడంతో పాటు ప్రపంచ మార్కెట్లలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయని ఆయన అన్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా ఈ ప్లాంట్ ద్వారా స్థానిక యువతకు సొంత గడ్డపైనే ఉపాధి లభించడం అత్యంత సంతృప్తిని ఇస్తోందని లోకేశ్ పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం యువత కుటుంబాలను, ఊళ్లను వదిలి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఉద్యోగాలే యువతను వెతుక్కుంటూ రావాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, రాయలసీమ ప్రజలకు ఇచ్చిన ఆ మాటను నిలబెట్టుకుంటున్నామని తెలిపారు.
ఈ భారీ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు 1,200 ప్రత్యక్ష ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయని, అదే సమయంలో రవాణా, వ్యవసాయం, ఇతర అనుబంధ రంగాల్లో పెద్దఎత్తున పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. నంద్యాలకు చెందిన మహేశ్ హరి, కర్నూలుకు చెందిన ఆర్.కె. స్ఫూర్తి వంటి స్థానిక యువతీ యువకులు సొంత ప్రాంతంలోనే ఇలాంటి ప్రపంచ స్థాయి సంస్థలో పనిచేస్తుండటం శుభపరిణామమని లోకేశ్ ప్రస్తావించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి భవిష్యత్తులో ఇలాంటి విజయగాథలు మరిన్ని రావాలని, అందరం కలిసి ఆ దిశగా అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.