- అస్వస్థతకు గురైన టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణ
- కొనకళ్ల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించిన సీఎం చంద్రబాబు
- మణిపాల్ నుంచి హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి కొనకళ్ల తరలింపు
- కిమ్స్ యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశం
- కొనకళ్ల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి
అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏపీ ఆర్టీసీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణ ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. కొనకళ్ల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన ముఖ్యమంత్రి, ఆయన తాజా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం కొనకళ్ల నారాయణకు అందుతున్న వైద్యం గురించి కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు వివరాలు అడిగారు. మెరుగైన చికిత్స కోసం ఆయనను మణిపాల్ ఆసుపత్రి నుంచి హైదరాబాద్లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రికి తరలిస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని సీఎం వారికి భరోసా ఇచ్చారు. కొనకళ్ల నారాయణ త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
కొనకళ్ల నారాయణను హైదరాబాద్కు తరలిస్తున్నారన్న సమాచారంతో సీఎం చంద్రబాబు వెంటనే కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యంతో కూడా ఫోన్లో మాట్లాడారు. కొనకళ్ల నారాయణ చేరగానే ఆయనకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, మెరుగైన చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆసుపత్రి వైద్యులకు, యాజమాన్యానికి ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
కొనకళ్ల నారాయణరావు ఈ ఉదయం హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఉదయం ఆయనకు తీవ్రంగా కళ్లు తిరగడంతో కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఆయన బ్రెయిన్లో రక్తపు గడ్డ (క్లాట్) ఉన్నట్లు గుర్తించారని సమాచారం. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను హుటాహుటిన విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు.